BRS Party Vaira: మాజీ ఎమ్మెల్యే రాసలీలలు సోషల్ మీడియాలో ఫోటోలు ప్రత్యక్షం
ఇది అంతా ఎమ్మెల్యే కుట్ర అంటున్న మదన్ లాల్ వర్గం.

Vaira BRS MLA Fliting With Girl
మదన్ లాల్ కు సీటు ఖరారు అయిందన్న ఆక్రోశంతో మార్పింగ్ చేశారంటున్న మాజీ ఎమ్మెల్యే వర్గం. మాకు అటువంటి కుట్రలు పన్నాల్సిన అవసరం లేదంటున్నఎమ్మెల్యే రాముల్ నాయక్. వైరా నియోజకవర్గంలో హాట్ హాట్ గా మారిన రాజకీయాలు. ఖమ్మం జిల్లా వైరా మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ కు సీటు ఖారారు అయ్యిందని వస్తున్న వార్తల నేపథ్యంలో ఆయన రాసలీలల ఫోటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయ్యాయి. ఇవి ఇప్పుడు వైరా నియోజకవర్గంలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. అయితే ఇది అంతా ఎమ్మెల్యే రాములు నాయక్ వర్గం కుట్ర అని మదన్ లాల్ వర్గం ఆరోపిస్తోంది. శాసనసభ ఎన్నికల దగ్గర పడుతున్న వేళ వైరా నియోజకవర్గంలో రాజకీయాలు చాలా వేడెక్కాయి. ఇక్కడ మాజీ ఎమ్మెల్యే గా ఉన్న మదన్ లాల్ మీద గత రాత్రి నుంచి సోషల్ మీడియాలో కొన్ని పోటోలు వైరల్ అవుతున్నాయి. మదన్ లాల్ ఒక అమ్మాయి తో ముద్దు పెట్టుకున్నఫోటోలు గత రాత్రి నుంచి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.
వైరా ఎమ్మెల్యేగా ఉన్న రాములు నాయక్ కు పని తనం సరిగ్గా లేదని ఆయనకు సీటును ఇవ్వడం లేదని దాదాపుగా అధిష్టానం చెప్పిందంట. దీంతో రాముల్ నాయక్ హైదరాబాద్ లోని ప్రగతి భవన్ చుట్టు, అటు కెసిఆర్, ఇటు కెటిఆర్, హరీష్ రావు ల చుట్టు తిరుగుతున్నాడు. గత ఎన్నికల్లో రాముల్ నాయక్ కాంగ్రెస్ తిరుగుబాటు అభ్యర్ధిగా పోటీ చేసి బీఆర్ఎస్ అభ్యర్ధి మదన్ లాల్ పై గెలుపొందాడు.అయితే ఎమ్మెల్యేగా అయిన దగ్గర నుంచి రాముల్ నాయక్ ఏదో ఒక వివాదానికి కారణం అవుతున్నాడు. దీంతో ఈ సారి ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ కట్ చేశారని ప్రచారం ఉంది. ఈనేపథ్యంలోనే మదన్ లాల్ కు సీటును ఖరారు చేశారని వార్తలు వినిపిస్తున్నాయి. మదన్ లాల్ కు హైదరాబాద్ రమ్మని చెప్పినట్లుగా జోరుగా ప్రచారం సాగుతుంది. ఈ సందర్బంగా మదన్ లాల్ కు సీటు కన్ పర్మ్ చేశారని జరుగుతున్న సమయంలో మదన్ లాల్ పై రాసలీలలు పోటోలు సోషలో మీడియాలో ప్రత్యక్షం అయ్యాయి. ఇవన్ని రాముల్ నాయక్ అనుచరులు చేస్తున్నకుట్రలుగా మదన్ లాల్ అంటున్నారు. దీంతో ఎన్నికల వేళ ఈ ఘటన ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో వేచి చూడాలి.