PITHAPURAM YCP: పిఠాపురం వైసీపీలో వర్గపోరు.. పవన్‌కు ప్లస్ అవుతుందా..?

పిఠాపురం సిట్టింగ్ ఎమ్మెల్యే పెండెం దొరబాబును కాదని.. ఎంపీగా ఉన్న వంగ గీతను తీసుకొచ్చి ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టింది వైసీపీ. ఆగ్రహంతో రగిలిపోయిన దొరబాబుని పిలిపించి బుజ్జగించారు సీఎం జగన్. మళ్ళీ పార్టీ అధికారంలోకి వచ్చాక.. తగ్గిన గుర్తింపు ఇస్తానని హామీ ఇచ్చారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 10, 2024 | 02:22 PMLast Updated on: Apr 10, 2024 | 2:22 PM

Pithapuram Is Tough For Ycp Clash Between Ysrcp Leaders Pawan Will Benifit

PITHAPURAM YCP: ఏపీలోని పిఠాపురం నియోజకవర్గం రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయింది. అక్కడ జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేస్తుండటమే ఇందుక్కారణం. ఆయనకు ఆపోజిట్‌గా వైసీపీ నుంచి వంగా గీత బరిలో ఉన్నారు. ఒకప్పుడు చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం నుంచి పిఠాపురంలో ఎమ్మెల్యేగా గెలిచారామె. కానీ ఇప్పుడు తనకు బలమైన ప్రత్యర్థిగా పవన్ కల్యాణ్ ఉండగా.. మరోవైపు YCPలో వర్గపోరుతో ఇబ్బంది పడుతున్నారు. పిఠాపురం సిట్టింగ్ ఎమ్మెల్యే పెండెం దొరబాబును కాదని.. ఎంపీగా ఉన్న వంగ గీతను తీసుకొచ్చి ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టింది వైసీపీ. ఆగ్రహంతో రగిలిపోయిన దొరబాబుని పిలిపించి బుజ్జగించారు సీఎం జగన్.

Nandamuri Balakrishna: అన్‌స్టాఫుబుల్ సీజన్ 4లో ట్విస్ట్.. ఏం పర్లేదు …

మళ్ళీ పార్టీ అధికారంలోకి వచ్చాక.. తగ్గిన గుర్తింపు ఇస్తానని హామీ ఇచ్చారు. కానీ వంగా గీత – దొరబాబుకి ఎక్కడా పొసగడం లేదు. ఇద్దరూ కలసి ప్రచారం చేసిన సందర్భాలు కూడా లేవంటున్నారు. పైగా దొరబాబు అనుచరుల్లో ఒక్కొక్కరు జనసేనలో చేరిపోతున్నారు. నేను గతంలో పిఠాపురంలో గెలిచా.. నియోజకవర్గం గురించి నాకు అంతా తెలుసు.. ఎన్నికల నాటికి అందరూ కలసి వస్తారు.. అని ధీమా వ్యక్తం చేస్తున్నారట వంగా గీత. ఇది తెలిసినప్పటి నుంచి దొరబాబు అసలు ప్రచారానికి వెళ్ళడమే మానేశారు. ఆయన అనుచరులు గీతకు టిక్కెట్ ఇవ్వడాన్ని ఇప్పటికీ ఒప్పుకోవట్లేదు. ఆమెకు నియోజకవర్గ బాధ్యతలు అప్పగించి 3 నెలలు అయ్యాయి. అసలు పిఠాపురంలో ఏమాత్రం అయినా ప్రభావం చూపించారా.. అధిష్టానం లేటెస్ట్ సర్వే చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక పిఠాపురంలో పవన్‌కి వ్యతిరేకంగా.. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం సేవలు వాడుకోవాలని వైసీపీ భావించింది. కానీ ముద్రగడ చెబితే ఓట్లు వేసే పరిస్థితి లేదంటున్నారు స్థానిక కాపు నేతలు. పవన్ కల్యాణ్‌పై ఆయన చేస్తున్న విమర్శలు, ఆరోపణలు.. వైసీపీకి మైనస్సే అవుతాయని భావిస్తున్నారు.

నువ్వు మగాడివైతే.. నన్ను తిట్టు.. నా మీద ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడు.. అంటూ వీరావేశం ప్రదర్శిస్తున్నారు ముద్రగడ. కానీ పవన్ ఆయన్ని ఎప్పుడో లైట్ తీసుకున్నారు. అటు దొరబాబు సహకరించక.. ఇటు ముద్రగడ వల్ల ఉపయోగం లేక.. వంగా గీత పిఠాపురంలో చివరకు ఒంటరి అయ్యారు. తన దగ్గరున్న కొద్దిమంది నేతలతోనే ప్రచారం చేసుకుంటున్నారు. వైసీపీలో వర్గ విభేదాలు పవన్ కల్యాణ్‌కి ప్లస్ అవుతాయన్న టాక్ పిఠాపురంలో నడుస్తోంది. కానీ, ఈ నియోజకవర్గ బాధ్యతలను YCP సీనియర్ నేత మిథున్ రెడ్డి తీసుకోవడంతో.. ఎన్నికల నాటికి అందర్నీ సమన్వయం చేస్తారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.