TS GP Surpanches Retired: పాపం సర్పంచ్ లు…! నిధులు రాలేదు.. విధులూ దూరం!

తెలంగాణలో (Telangana) పదవీ విరమణ పొందుతున్న గ్రామపంచాయతీ సర్పంచ్ ల పరిస్థితి దారుణంగా ఉంది. అధిక వడ్డీలకు డబ్బులు తెచ్చి అభివృద్ధి పనులు చేస్తే లక్షలు... కోట్లల్లో డబ్బులు ప్రభుత్వం నుంచి రాలేదు. ఇప్పుడు పదవీ కాలం అయిపోతుండటంతో తమ గోడు వెళ్ళబోసుకుంటున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 27, 2024 | 11:14 AMLast Updated on: Jan 27, 2024 | 11:14 AM

Pity Sarpanchs Funds Are Not Received Duties Are Far Away

తెలంగాణలో (Telangana) పదవీ విరమణ పొందుతున్న గ్రామపంచాయతీ సర్పంచ్ ల పరిస్థితి దారుణంగా ఉంది. అధిక వడ్డీలకు డబ్బులు తెచ్చి అభివృద్ధి పనులు చేస్తే లక్షలు… కోట్లల్లో డబ్బులు ప్రభుత్వం నుంచి రాలేదు. ఇప్పుడు పదవీ కాలం అయిపోతుండటంతో తమ గోడు వెళ్ళబోసుకుంటున్నారు.

తెలంగాణలో గ్రామపంచాయతీ సర్పంచ్ (Sarpanch) లు గోస పడుతున్నారు. ఫిబ్రవరి 2 కల్లా వీళ్ళ ఐదేళ్ళ పదవీకాలం ముగుస్తోంది. దాంతో రాష్ట్రంలోని 12 వేల 752 పంచాయతీల సర్పంచ్ లు రిటైర్డ్ అవుతున్నారు. ఫిబ్రవరి 2 నుంచి ప్రత్యేక అధికారుల పాలనలోకి వెళ్ళాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం సర్పంచులను నానా ఇబ్బందులు పెట్టింది. పంచాయతీలకు నిధులు ఇవ్వకుండా… కొత్త కొత్త స్కీమ్స్ తెచ్చింది. ఆ పథకాలు తప్పనిసరిగా అమలు చేయాలని ఆదేశాలు ఇచ్చింది. కలెక్టర్లు, జిల్లా పంచాయతీ అధికారుల ఒత్తిడి తట్టుకోలేక… ఎక్కడ పదవి నుంచి తీసేస్తారో అన్న భయంతో చాలామంది సర్పంచులు తమ సొంత ఆస్తులు అమ్ముకొని గ్రామాల్లో పనులు చేయించారు.

కొందరు అధిక వడ్డీలకు అప్పులు తెచ్చారు. సొంత నిధులతో పంచాయతీలకు కొత్త బిల్డింగ్స్ నిర్మించారు. శ్మశాన వాటికలు, పార్కులు, ప్లే గ్రౌండ్స్, ఉపాధి హామీ, ప్రత్యేక అభివృద్ధి నిధి, రాష్ట్ర ఆర్థిక సంస్థ పరిధిలోని పనులను అనేకం చేపట్టారు. కేసీఆర్ హయాంలో లక్షలు, కోట్ల రూపాయల్లో సర్పంచ్ లకు నిధులు రావాల్సి ఉంది. ఇప్పుడు ప్రభుత్వం మారింది. దాంతో తమ నిధులను ఇప్పించాలని సర్పంచులు ప్రాధేయ పడుతున్నారు.

రేవంత్ సర్కార్ ఇప్పటికప్పుడు గ్రామపంచాయతీలకు ఎన్నిలకు జరిపే పరిస్థితుల్లో లేదు. అందువల్ల కనీసం తమ పదవీకాలాన్ని అయినా మరో రెండేళ్ళు పెంచాలని రిక్వెస్ట్ చేస్తున్నారు. పదవీకాలం పొడిగిస్తే అయినా తమ నిధులు వస్తాయన్న నమ్మకం ఉంటుందని సర్పంచ్ లు అంటున్నారు.

వచ్చే నెల 2 నుంచి ప్రత్యేక అధికారుల పాలన వస్తుండటంతో… తమకు అన్యాయం జరుగుతుందని వాపోతున్నారు. గ్రామపంచాయతీల ఎన్నికలు పార్టీలకతీతంగానే జరుగుతాయి. కానీ చాలామంది సర్పంచ్ లు బీఆర్ఎస్ కు అనుకూలమైన వాళ్ళ ఉన్నారు. దాంతో సర్పంచ్ ల పదవీకాలం పొడిగించడానికి సీఎం రేవంత్ రెడ్డి అంత సుముఖంగా లేనట్టు తెలుస్తోంది. అందుకే అధికారులు కూడా ప్రత్యేక అధికారులకు గ్రామపంచాయతీలను అప్పగించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.