PM MODI: బీఆర్ఎస్‌తో కాంగ్రెస్ కుమ్మక్కు.. కుటుంబ పార్టీల్ని నమ్మొద్దు: ప్రధాని మోదీ
కాళేశ్వరంలో అవినీతి జరిగిందని విమర్శలు చేసిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తోంది. బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోయింది. ఈ ప్రాజెక్ట్ విషయంలో బీఆర్ఎస్‌తో కాంగ్రెస్ కుమ్మక్కవుతోంది.
PM MODI: కాళేశ్వరంలో అవినీతి జరిగిందని చెప్పిన కాంగ్రెస్.. ఇప్పుడేం చేస్తోందని ప్రశ్నించారు ప్రధాని మోదీ. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో బీజేపీ, కాంగ్రెస్ ఒక్కటయ్యాయన్నారు. ఆదిలాబాద్‌లో సోమవారం బీజేపీ ఏర్పాటు చేసిన విజయ సంకల్ప సభలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై విమర్శలు చేశారు. “కాళేశ్వరంలో అవినీతి జరిగిందని విమర్శలు చేసిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తోంది. బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోయింది. ఈ ప్రాజెక్ట్ విషయంలో బీఆర్ఎస్‌తో కాంగ్రెస్ కుమ్మక్కవుతోంది.
REVANTH REDDY: కేంద్రంతో వైరం రాష్ట్రాభివృద్ధికి ఆటంకం.. పెద్దన్నలా మోదీ సహకరించాలి: సీఎం రేవంత్
గతంలో మీరు తిన్నారు.. ఇప్పుడు మేం తింటాం అన్నట్లుంది కాంగ్రెస్ పరిస్థితి. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదు. బీఆర్ఎస్ పోయి కాంగ్రెస్ వచ్చినా.. పాలనలో ఎలాంటి మార్పు లేదు. రెండు పార్టీల విధానం ఒక్కటే. కుటుంబ పాలనలో ఒకటి దోచుకోవడం.. రెండు అబద్దాలు వ్యాప్తి చేయడమే ఉంటుంది. కుటుంబ పాలనలో ఉన్న పార్టీలన్నీ ఒక్కటవుతాయి. అలాంటి వారిని ప్రజలు నమ్మొద్దు. పదేళ్ల బీజేపీ పాలనలో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టాం. బీజేపీ మాత్రమే దేశాభివృద్ధి లక్ష్యంతో పాలన చేస్తుంది. ఇది ఎన్నికల సభ కాదు. అభివృద్ధి ఉత్సవ సభ. వికసిత్ భారత్‌లో భాగమవ్వాలని ప్రజలను కోరేందుకే వస్తున్నా. దేశంలో 7 మెగా టెక్స్‌టైల్ పార్కులు ఏర్పాటు చేయబోతున్నాం. ఇందులో ఒకటి తెలంగాణలో పెడుతున్నాం. 15 రోజుల వ్యవధిలో 5 ఎయిమ్స్‌లను ప్రారంభించాం. ఆదివాసీ మహిళను రాష్ట్రపతిని చేసిన ఘనత బీజేపీది. రెండు ఐఐటీలు, ఒక ట్రిపుల్ ఐటీ, ఒక ఐఐఎం, ఎయిమ్స్, వంటివి ఇవాళ ప్రారంభంచిన మరికొన్ని ప్రాజెక్టులు.
వాటిలో చాలా ప్రాజెక్టులు తెలంగాణకు కేటాయించాం. ఆదిలాబాద్‌కు చాలా చరిత్ర ఉంది. ఎందరో స్ఫూర్తినిచ్చే నేతలు ఉన్నారు. ఇలాంటి ప్రాంతం నుంచే ముర్ము అనే మహిళ రాష్ట్రపతి అయ్యారు. తెలంగాణలోని గిరిజన నేతల్లో కూడా పేరున్న వాళ్లు ఉన్నారు. రాంజీ గోండు పేరుతో హైదరాబాద్‌లో మ్యూజియం ఏర్పాటు చేస్తున్నాం. సమ్మక్క సారలమ్మ ట్రైబల్ యూనివర్సిటీ, పసుపు బోర్డు.. ఇలా చాలా విషయాల్లో తెలంగాణకు తోడ్పాటు అందిస్తున్నాం. త్వరలో జగనున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 400 సీట్లను గెలవాలి. మోదీ గ్యారంటీ అంటే కచ్చితంగా అమలయ్యే గ్యారంటీ. 140 కోట్ల మంది ప్రజలే నా కుటుంబం. ప్రజల కలలను సాకారం చేసేందుకు నేను పని చేస్తా” అని మోదీ వ్యాఖ్యానించారు.