PM MODI: ఫాంహౌజ్‌కే పరిమితమయ్యే సీఎం అవసరమా..? బీజేపీతోనే సామాజిక న్యాయం సాధ్యం: ప్రధాని మోదీ

సీఆర్ తన కుటుంబం గురించి మాత్రమే ఆలోచిస్తారు. ప్రజల భవిష్యత్ గురించి చింత లేదు. కేసీఆర్ ప్రభుత్వం 'ధరణి' ద్వారా భూ మాఫియాకు పాల్పడింది. కేసీఆర్ సర్కార్ పేదల వ్యతిరేక ప్రభుత్వం. ఇక్కడి ప్రజలకు ఇళ్లు ఇవ్వకుండా అడ్డుకుంటోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 26, 2023 | 06:45 PMLast Updated on: Nov 26, 2023 | 6:45 PM

Pm Modi Criticised Cm Kcr And Congress In Nirmal Meeting

PM MODI: ప్రజలను కలవకుండా, ఫాం హౌజ్‌కు మాత్రమే పరిమితమయ్యే సీఎం కేసీఆర్ తెలంగాణకు అవసరమా అని ప్రశ్నించారు ప్రధాని మోదీ. తెలంగాణలో కుటుంబ పాలన సాగుతోందన్నరు మోదీ. ఆదివారం తెలంగాణ ఎన్నికల ప్రచారలో భాగంగా.. తూఫ్రాన్, నిర్మల్‌లో జరిగిన సభల్లో ప్రదాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్‌, కాంగ్రెస్‌లపై విమర్శలు గుప్పించారు. “ప్రత్యేక రాష్ట్రంలో బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదు. పదేళ్లుగా రాష్ట్రంలో కుటుంబ పాలనే నడుస్తోంది.

Rahul Gandhi: డబ్బులు దోచుకోవడానికే కేసీఆర్ ప్రాజెక్టుల నిర్మాణం: రాహుల్ గాంధీ

కేసీఆర్ తన కుటుంబం గురించి మాత్రమే ఆలోచిస్తారు. ప్రజల భవిష్యత్ గురించి చింత లేదు. కేసీఆర్ ప్రభుత్వం ‘ధరణి’ ద్వారా భూ మాఫియాకు పాల్పడింది. కేసీఆర్ సర్కార్ పేదల వ్యతిరేక ప్రభుత్వం. ఇక్కడి ప్రజలకు ఇళ్లు ఇవ్వకుండా అడ్డుకుంటోంది. సర్కార్ స్టీరింగ్‌ను కేసీఆర్ వేరే పార్టీ చేతుల్లో పెట్టారు. రాష్ట్రంలో రూ.కోట్లల్లో ఇరిగేషన్ స్కాం జరిగింది. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటే. అబద్ధపు హామీలతో ప్రజలను మోసం చేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీని ముఖ్యమంత్రిని చేస్తాం. బీసీలకు బీజేపీతోనే ప్రయోజనాలు చేకూరుతాయి. సామాజిక న్యాయం బీజేపీతోనే సాధ్యమవుతుంది. పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ తగ్గిస్తాం. బీజేపీ అంటే పేదలకు గ్యారెంటీ ప్రభుత్వం. సకల జనుల సౌభాగ్య తెలంగాణ బీజేపీతోనే సాధ్యం. ప్రజలను కలవకుండా, ఫాం హౌజ్‌కు మాత్రమే పరిమితమయ్యే సీఎం కేసీఆర్ తెలంగాణకు అవసరమా..? ప్రపంచం మొత్తం మేక్ ఇన్ ఇండియా గురించి మాట్లాడుతుంటే.. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ ఆ విషయమే ప్రస్తావించవు.

మతం పేరిట ఓట్ల కోసమే ఐటీ పార్కులు చేపడతామని కాంగ్రెస్ చెబుతోంది. కాంగ్రెస్ హయాంలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. బీజేపీ హయాంలో ఉగ్రవాదం తగ్గుముఖం పట్టింది. ఆర్మూర్ పసుపు పంటకు జీఐ ట్యాగ్ వచ్చేలా కృషి చేస్తాం. నిజామాబాద్‌ను పసుపు నగరంగా ప్రకటిస్తాం. నిర్మల్‌లో బొమ్మల పరిశ్రమను బీఆర్ఎస్ పట్టించుకోలేదు. ఈటలకు భయపడే సీఎం కేసీఆర్ రెండు చోట్ల పోటీ చేస్తున్నారు” అని ప్రధాని వ్యాఖ్యానించారు.