PM MODI: మోదీకి దేశమే ఫస్ట్.. కుటుంబ పాలనకు మేం వ్యతిరేకం: ప్రధాని మోదీ

నేను కుటుంబ పాలనపై ప్రశ్నిస్తున్నందుకే నాపై విమర్శలు చేస్తున్నారు. కుటుంబ పాలన చేసే వారికి రాష్ట్ర సంపద దోచుకునేందుకు లైసెన్స్ ఇచ్చారా..? ఒక్కో కుటుంబంలో 50 మంది వరకు ప్రజల సొమ్ము దోచుకు తింటున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 5, 2024 | 03:59 PMLast Updated on: Mar 05, 2024 | 8:48 PM

Pm Modi Criticises Congress And Brs In Sangareddy Meeting

PM MODI: కుటుంబ పార్టీలు తమ కుటుంబమే ఫస్ట్ అనుకుంటాయని, కానీ మోదీకి నేషన్ ఫస్ట్ అన్నారు ప్రధాని మోదీ. తెలంగాణలో పర్యటిస్తున్న ప్రధాని మోదీ.. సంగారెడ్డిలో బీజేపీ విజయ సంకల్ప సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, బీఆర్ఎస్‌పై విమర్శలు గుప్పించారు. “మోదీకి కుటుంబం లేదని ఇండియా కూటమి నేతలు మాట్లాడుతున్నారు. దేశ ప్రజలంతా మోదీ కుటుంబ సభ్యులే. మేమంతా మోదీ కుటుంబమే అని తెలంగాణ ప్రజలు అంటున్నారు. జమ్ము కశ్మీర్ నుంచి తమిళనాడు వరకు కుటుంబ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కుటుంబాలు మాత్రమే బాగుపడ్డాయి.

YS JAGAN: ఏపీ రాజధానిగా విశాఖ.. తేల్చేసిన సీఎం జగన్

అందుకే బీజేపీ.. కుటుంబ పాలనను వ్యతిరేకిస్తుంది. నేను కుటుంబ పాలనపై ప్రశ్నిస్తున్నందుకే నాపై విమర్శలు చేస్తున్నారు. కుటుంబ పాలన చేసే వారికి రాష్ట్ర సంపద దోచుకునేందుకు లైసెన్స్ ఇచ్చారా..? ఒక్కో కుటుంబంలో 50 మంది వరకు ప్రజల సొమ్ము దోచుకు తింటున్నారు. కుటుంబ పార్టీలు తమ కుటుంబమే ఫస్ట్ అనుకుంటాయి. కానీ మోదీకి నేషన్ ఫస్ట్. మోదీకి కుటుంబం లేకపోతే కుటుంబ పార్టీలన్నీ యుద్ధానికి దిగుతాయా? కుటుంబ పార్టీలతో ప్రతిభ ఉన్నవారికి అన్యాయం జరుగుతోంది. వారసత్వ నేతలకు మోదీ భయం పట్టుకుంది. దేశ ప్రజల భవిష్యత్తును ఉజ్వలం చేయడం కోసం నా జీవితంలోని ప్రతి క్షణం ఆర్పిస్తాను. 70 ఏళ్లలో కాంగ్రెస్‌ చేయలేని పనిని పదేళ్లలో బీజేపీ ప్రభుత్వం చేసి చూపింది. కుటుంబ పాలకుల అవినీతి సొమ్మును వెలికితీస్తున్నాం. వీళ్లంతా నల్లధనం దాచుకోవడానికే విదేశాల్లో ఖాతాలు తెరిచారు. కాంగ్రెస్‌, బీఆర్ఎస్ రెండూ ఒక్కటే. ఈ రెండు పార్టీలూ కుమ్మక్కయ్యాయి.

కాళేశ్వరం పేరుతో బీఆర్ఎస్ కోట్లు దోచుకుతింది. తెలంగాణలో బీజేపీకి ప్రజల్లో ఆదరణ పెరుగుతోంది. మీ ఆశీర్వాదాలను వృథా కానివ్వను. మోడీ ఏదైతే చెబుతాడో అదే చేసి చూపుతాడు. దేశాన్ని ప్రపంచంలో సరికొత్త శిఖరాలకు చేర్చాల్సిన అవసరం ఉంది. ప్రపంచ దేశాల్లో తెలుగు ప్రజలు కీలకభూమిక పోషిస్తున్నారు. ఇండియాను అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థ గల దేశంగా తీర్చిదిద్దడమే మరో గ్యారంటీ” అని మోదీ వ్యాఖ్యానించారు.