Narendra Modi : రేపు రాష్ట్రానికి ప్రధాని మోదీ
ఏపీ రాష్టానికి సార్వత్రిక ఎన్నికల (AP Assembly Elections) ఎంతో దగ్గరలో లేవు.. ఈ సారి ఏపీలో బీజేపీ పరపతి పెంచుకునేందుకు బీజేపీ అగ్రనేతలు అందరూ ఆంధ్ర రాష్ట్రానికి క్యూ కడుతున్నారు.

PM Modi for the state tomorrow
ఏపీ రాష్టానికి సార్వత్రిక ఎన్నికల (AP Assembly Elections) ఎంతో దగ్గరలో లేవు.. ఈ సారి ఏపీలో బీజేపీ పరపతి పెంచుకునేందుకు బీజేపీ అగ్రనేతలు అందరూ ఆంధ్ర రాష్ట్రానికి క్యూ కడుతున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగానే నేడు కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) ఏపీలోని ధర్మవరం లో బీజేపీ (BJP) ఎమ్మెల్యే అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేయనున్నారు.
రేపు ఏకంగా ప్రధాన నరేంద్ర మోదే రంగంలోకి దిగనున్నారు. మోదీ మే 6నా (రేపు) ఆంధ్రప్రదేశ్ లోని రాజమహేంద్రవరం వస్తున్నారు. అక్కడ నుంచి కశింకోట వెళ్తారు. కాగా, రాజమహేంద్రవరంలో ప్రధాని విజయ శంఖారావం సభకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. రాజమండ్రి, అనకాపల్లి నియోజకవర్గాల్లో జరిగే బహిరంగ సభల్లో పాల్గొంటారు. అలాగే ఈ నెల 7న రాజంపేట నియోజకవర్గంలో జరిగే బహిరంగ సభ, విజయవాడలో జరిగే రోడ్ షోలో ఆయన పాల్గొననున్నారు. ప్రధాని పర్యటనకు పోలీసులు అసాధారణ భద్రత కల్పిస్తున్నారు. ప్రధాని పర్యటించే ప్రాంతాలను భద్రతా బలగాలు పూర్తిగా తమ అధీనంలోకి తీసుకున్నాయి.
SSM