Modi: ప్రజాస్వామ్యంలో రాజదండంపై గొప్పలు ఎందుకు? మోదీ రాజులా ఫీల్ అవుతున్నాట్టున్నారు!
కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవ వేడుకలో ప్రధాని మోదీ రాజదండం పట్టుకునే తిరిగారు.. అసలు రాజదండానికి పబ్లిసిటీ ఇవ్వడం కోసమే కొత్త పార్లమెంట్ కట్టారేమో అనిపించేలా ఆయన తీరు సాగింది. పార్లమెంట్ ప్రారంభోత్సవాన్ని ప్రధాని పట్టాభిషేకంలా భావిస్తున్నారంటూ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు కూడా ఇదే విషయాన్ని నొక్కి చెబుతోంది.
ప్రజాస్వామ్యంలో ప్రజలే రాజులు.. రాజకీయ నాయకులు ప్రజల సేవకులు. మనం ఓట్లేసి గెలిపిస్తే అధికారంలోకి వచ్చిన వాళ్లు మనపైనే పెత్తనం చెలాయిస్తే ఎలా? పరోక్షంగానో.. ప్రత్యక్షంగానో.. తెలివగానో కేంద్రంలోని బీజేపీ.. రాజుల తరహాలోనే ప్రవర్తిస్తూ పాలిస్తోంది.! ప్రాంతీయ పార్టీల గొంతు నొక్కేందుకు రాష్ట్రాలకు అన్యాయం చేస్తోంది. కేంద్ర సంస్థలను తమ గుప్పిట్లో పెట్టుకొని ఓ ఆట ఆడిస్తోంది. ఇదంతా ప్రజాస్వామ్య రాచరిక వ్యవస్థ కావొచ్చు..అంటే జనాలకు బయటకు ప్రజాస్వామ్య దేశంలా కలరింగ్ ఇస్తూ పాలించే తీరు మాత్రం రాచరిక వ్యవస్థలోనే నడిచించే నైజం అన్నమట!
ఇది మన దేశంలోనే కాదు.. ప్రపంచంలో చాలా దేశాల నేతలు ఇప్పుడు ఇలానే ప్రజలను మభ్య పెడుతున్నారు. వేల ఏళ్లగా రాచరికంలో మన పూర్వికులు పాడరాని పాట్లూ పడ్డారు.! వాడు పోతే వీడు.. వీడు పోతే వాడు అన్నట్టు అధికార మార్పిడి కొన్ని కుటుంబాల మధ్య సాగేది. ప్రపంచంలో ఎన్నో విప్లవాల తర్వాత రాచరికానికి దారులు మూసుకుపోవడంతో ఇప్పుడు ప్రజాస్వామ్య ఫలాలను అనుభవిస్తున్నాం..అయితే అప్పటి గుర్తులను తవ్వితీసేందుకు బీజేపీ నడుం బిగించింది. రాజదండం అధికార మార్పిడికి చిహ్నమంటూ ఎప్పుడో పాతుకుపోయిన ‘కర్ర కల్చర్’ను బయటకు తీసింది. ఆ కర్ర పట్టుకునే మోదీ తిరిగారు. గాంధీ చేతిలో కర్ర కంటే అదో పవర్‌ఫుల్ వెపన్ లాగా ఆయన దాన్ని ఫీల్ అవుతున్నారు.
బ్రిటీష్ వాళ్లు పోతూ పోతూ నెహ్రూకు ఆ కర్రను అప్పగించారని.. అది ఆయన మ్యూజియం పడేశాడన్నది బీజేపీ వాదన. కాసేపు ఇదంతా నిజమే అనుకుందాం..! ఒకవేళ నిజమైనా నెహ్రూ చేసిన దాంట్లో తప్పేముంది..? భారత్ ప్రజాస్వామ్య దేశం.. నెహ్రూ సోషలిస్ట్ ఐడియాలు కలిగిన నాయకుడు.. ప్రజాస్వామ్యానికి ఆయనకు తెలిసిన అర్థం మోదీకి తెలిసి ఉండకపోవచ్చు..పైగా వేలాది మంది ప్రాణాలు త్యాగం చేస్తే మనకు స్వాతంత్రం వచ్చింది.. అప్పటివరకు ఉన్న రాజచరిక పాలనకు ముగింపు పడింది..! అందుకే ఆ రాజదండాన్ని మ్యూజియం పెట్టి ఉంటారు.. ఇప్పుడు దాన్ని తీసుకొచ్చి కొత్తగా నిర్మించిన పార్లమెంట్‌లో ప్రతిష్టించారు. పూజలు కూడా చేశారు. మోదీ ఆ రాజదండాన్ని గ్రౌండ్‌లో పిల్లోడు బ్యాట్ పట్టుకోని తిరిగినట్లు తిరిగారు. రాజదండం గురించి గొప్పలకు పోయారు.
మరోవైపు నెహ్రూ విషయంలో లేనిపోనివి సృష్టిస్తూ.. ఆయన అసలు హిందూవే కాదు అని.. అతని పుట్టుక ఓ ‘ఏరియా’లో జరిగిందని విషం కక్కే అసత్యవాదులైన బీజేపీ సోషల్‌మీడియా యాక్టివిస్టులు మరోసారి తమ అబద్ధాలకు పని చెప్పారు. రాజదండం విషయంలో అంతా నెహ్రూనే కార్నర్ చేశారు.. ఆయన ఏదో చేయకూడని పని చేసినట్టు బీజేపీ వర్గాలు నోటికి వచ్చింది మాట్లాడుతున్నాయి. అసలు బీజేపీ చెప్పింది కట్టుకథ అని.. నెహ్రూకి బ్రిటీష్ వాళ్లు అసలు ఆ రాజదండమే ఇవ్వలేదని 1947 ఆగస్టు 17 నాటి ఆంధ్రపత్రికలో వెలువడిన కథనం చూస్తే అర్థమవుతుంది. అప్పటి పేపర్‌లో రాజదండం గురించి క్లియర్‌గా రాసి. ఆ రాజదండం ఫోటోను కూడా ప్రచురించారు. అయితే ఆ రాజదండాన్ని మౌంట్ బాటెన్ ఇచ్చినట్టు లేదు. తమిళనాడులోని తిరువపడుతురై మఠాధిపతి స్వాతంత్రం వచ్చిన సందర్భంగా నెహ్రూకు బహూకరించినట్టు రాసి ఉంది. అయినా ఇవ్వని మాకు అనసవరం.. మేము చెప్పిందే రైటూ..నెహ్రూ రాంగూ..మోది తోపు.. ఇదే మా లెక్క.!