PM MODI: హైదరాబాద్‌లో ప్రధాని మోడీ రోడ్ షో.. పోటెత్తిన జనం..

ప్రధాని రోడ్ షో సందర్భంగా ఈ ప్రాంతమంతా కాషాయమయమైంది. దారి పొడవునా బీజేపీ శ్రేణులు మోదీకి ఘన స్వాగతం పలికారు. బ్రహ్మరథం పట్టారు. దారంతా పూలు చల్లుతూ మోదీపై తమ అభిమానాన్ని చాటుకున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 27, 2023 | 06:29 PMLast Updated on: Nov 27, 2023 | 6:29 PM

Pm Modi Road Show In Hyderabad In The Presence Of Huge Crowd

PM MODI: ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్‌లో రోడో షోలో పాల్గొన్నారు. సోమవారం సాయత్రం మోదీ రోడ్ షో ప్రారభమైంది. ఆర్టీసీ క్రాస్ రోడ్ నుంచి నారాయణ గూడ, వైఎంసీఏ మీదుగా కాచిగూడ వరకు ఈ యాత్ర సాగనుంది. రోడ్డు షోలో ప్రధానితోపాటు టీ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, కే.లక్ష్మణ్ పాల్గొన్నారు. దాదాపు మూడు కిలోమీటర్ల మేర ఈ యాత్ర సాగింది. ప్రధాని రోడ్ షో సందర్భంగా ఈ ప్రాంతమంతా కాషాయమయమైంది. దారి పొడవునా బీజేపీ శ్రేణులు మోదీకి ఘన స్వాగతం పలికారు.

TELANGANA CONGRESS: హరీష్ రావు మైండ్ బ్లాక్ అయింది.. బీఆర్ఎస్‌ది తప్పుడు ప్రచారం: కాంగ్రెస్ నేతలు

బ్రహ్మరథం పట్టారు. దారంతా పూలు చల్లుతూ మోదీపై తమ అభిమానాన్ని చాటుకున్నారు. మోదీ.. ప్రజలకు అభివాదం చేస్తూ ఉత్సాహంగా కనిపించారు. ఈ నేపథ్యంలో పోలీసులు గట్టి భద్రత ఏర్పాటు చేశారు. చిక్కడపల్లి, నారాయణగూడ మెట్రో స్టేషన్లను మూసివేయడంతోపాటు, పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సాయంత్రం 4:45 నుంచి 6:45 గంటల వరకు రైలు ఆగదని ప్రయాణికులకు సూచించారు. రాత్రి పది గంటల వరకు ఆంక్షలు కొనసాగుతాయి.