PM Modi Roadshow @ Ayodhya: అయోధ్యలో ప్రధాని నరేంద్రమోడీ రోడ్ షో

ప్రధాని నరేంద్రమోడీ అయోధ్య నగరంలో ఇవాళ రోడ్ షో నిర్వహించారు.  రోడ్డుకు రెండు వైపులా 1400 మంది కళాకారులు, స్వాగతాలతో అయోధ్య కళ కళలాడింది. 

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 30, 2023 | 11:39 AMLast Updated on: Dec 30, 2023 | 11:39 AM

Pm Modi Roadshow Ayodhya

2024 జనవరి 22నుంచి అయోధ్యలో భవ్య రామాలయం ప్రారంభమవుతోంది.  ఈ సందర్భంగా అయోధ్యలో కొత్తగా విమానాశ్రయాన్ని నిర్మించడంతో పాటు… రైల్వే స్టేషన్ ను రూ.240 కోట్లతో పునరుద్దరించారు.  ఉదయం 10.30 గంటలకు కొత్త రైల్వే స్టేషన్ ను ప్రారంభించారు ప్రధాని మోడీ. మూడు అంతస్తుల్లో రైల్వే స్టేషన్ ఆధునీకరించారు.

రైల్వే జంక్షన్లకు అయోధ్య ధామ్ జంక్షన్ గా పేరు పెట్టారు. మధ్యాహ్నం 12.30 గంటలకు ఎయిర్ పోర్ట్ ను ప్రారంభిస్తున్నారు ప్రధాని మోడీ. దీన్ని మహర్షి వాల్మీకి ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ అయోధ్యధామంగా పిలుస్తారు.

1450 కోట్లతో ఎయిర్ పోర్ట్ నిర్మాణం 6500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో టెర్నినల్ భవనం నిర్మించారు. ఒకేసారి 600 మంది ప్రయాణీకులు రాకపోకలు సాగించవచ్చు. దేశంలోని అన్ని ప్రధాన నగరాల నుంచి అయోధ్యకు విమాన సర్వీసులు అందుబాటులో ఉంటాయి. రూ.15,700లతో మరో 46 మౌలిక సదుపాయాలు, పనులకు ప్రధాని మోడీ శంకుస్థాపన చేయనున్నారు. ప్రధాని నరేంద్రమోడీ 15 కిలోమీటర్ల రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా  40 వేదికలపై దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 1400 మంది కళాకారులతో ప్రదర్శనలు జరుగుతున్నాయి.