The BAPS Hindu Mandir: యూఏఈలో తొలి హిందూ దేవాలయం.. 14న ప్రారంభించనున్న ప్రధాని మోదీ

ఇది యూఏఈలోని మొదటి హిందూ దేవాలయం. ఈ ఆలయ నిర్మాణానికి అవసరమైన 13.5 ఎకరాల భూమని అబుదాబి యువరాజు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ విరాళంగా ఇచ్చారు. 2015లో ప్రధాని మోదీ అక్కడ పర్యటించినప్పుడు ఈ మేరకు భూమి కేటాయించారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 13, 2024 | 06:48 PMLast Updated on: Feb 13, 2024 | 6:48 PM

Pm Modi To Inaugurate Uaes 1st Hindu Temple The Baps Hindu Mandir

The BAPS Hindu Mandir: ‍యూఏఈ (యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్)లో నిర్మించిన తొలి హిందూ దేవాలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. బీఏపీఎస్ హిందూ మందిర్‌గా పిలిచే ఈ ఆలయాన్ని ఫిబ్రవరి 14, బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించబోతున్నారు. ఆధ్యాత్మిక గురువు మహంత్ స్వామి మహరాజ్ ఆధ్వర్యంలో ఈ ఆలయ ప్రారంభోత్సవం జరగనుంది. ఇప్పటికే మహంత్ స్వామి మహారాజ్ యూఏఈ చేరుకున్నారు. మోదీ.. బుధవారం అక్కడికి వెళ్తారు.

AP CAPITAL: వైసీపీ నేతల కొత్త కామెడీ.. ఏపీకి మూడు కాదు.. నాలుగు రాజధానులు కావాలట..

ఇది రాతి దేవాలయం. బీఏపీఎస్ హిందూ మందిర్ అనే ఈ ఆలయాన్ని పింక్ రాజస్థాన్ ఇసుకరాయి, ఇటాలియన్ వైట్ పాలరాతి రాళ్లను ఉపయోగించి నిర్మించారు. వీటిని ఇండియా నుంచి యూఏఈకి తరలించి, నిర్మించారు. ఇది యూఏఈలోని మొదటి హిందూ దేవాలయం. ఈ ఆలయ నిర్మాణానికి అవసరమైన 13.5 ఎకరాల భూమని అబుదాబి యువరాజు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ విరాళంగా ఇచ్చారు. 2015లో ప్రధాని మోదీ అక్కడ పర్యటించినప్పుడు ఈ మేరకు భూమి కేటాయించారు. అనంతరం 2019లో యూఏఈ మరో 13.5 ఎకరాల భూమి ఇచ్చింది. దీంతో 27.5 ఎకరాల్లో ఈ హిందూ దేవాలయం నిర్మితమైంది. మొదట 2017లో ప్రధాని అక్కడ పర్యటించినప్పుడు ఈ భూమికి శంకుస్థాపన చేశారు. ఈ ఆలయ నిర్మాణానికి 400 మిలియన్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దిర్హమ్ ఖర్చయ్యాయి.

ఆలయ సముదాయంలో సందర్శకుల కేంద్రం, ప్రార్థనా మందిరాలు, గార్డెన్స్ వంటివి ఉన్నాయి. ఈ ఆలయంలో ఏడు గోపురాలు ఉన్నాయి. ఇవి ఒక్కొక్కటి ఒక్కో యూఏఈ ఎమిరేట్‌కు ప్రతీకలుగా నిలుస్తాయి. యూఏఈలో తొలి హిందూ దేవాలయం ప్రారంభం అవుతుండటంపై అక్కడి హిందువులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.