PM MODI: తెలంగాణలో 7 వేల కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభించిన మోదీ..
ఉదయం బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి హెలికాప్టర్‌లో సంగారెడ్డిలోని పటాన్ చెరు చేరుకున్న ప్రధాని.. అక్కడే వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించారు. అక్కడి పలు పనుల్ని జాతికి అంకితం చేశారు. ఈ పర్యటనలో మొత్తంగా రూ.7 వేల కోట్ల అభివృద్ధి పనుల్ని మోదీ ప్రారంభించారు.
PM MODI: ప్రధాని నరేంద్ర మోదీ వరుసగా రెండో రోజు తెలంగాణలో పర్యటించారు. మంగళవారం తెలంగాణలోని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ముందుగా సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఉదయం బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి హెలికాప్టర్‌లో సంగారెడ్డిలోని పటాన్ చెరు చేరుకున్న ప్రధాని.. అక్కడే వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించారు. అక్కడి పలు పనుల్ని జాతికి అంకితం చేశారు.
YS JAGAN: సీఎంగా విశాఖలోనే ప్రమాణస్వీకారం.. జగన్‌కు ఇంత కాన్ఫిడెన్సా.. అంత ధైర్యమేంటి..?
ఈ పర్యటనలో మొత్తంగా రూ.7 వేల కోట్ల అభివృద్ధి పనుల్ని మోదీ ప్రారంభించారు. మెదక్- ఎల్లారెడ్డి మధ్య రూ.399 కోట్లతో నిర్మించిన 2 లైన్ల హైవేను జాతికి అంకితం చేశారు. సంగారెడ్డి చౌరాస్తా నుంచి మదీనా గూడ వరకు రూ.1298 కోట్లతో ఏర్పాటు చేసిన ఆరు వరుసుల జాతీయ రహదారి ప్రారంభించారు. పారాదీప్- హైదరాబాద్ మధ్య రూ.3338 కోట్లతో నిర్మించిన గ్యాస్‌పైప్‌లైన్ ప్రారంభించారు. కంది రామసామి పల్లె సెక్షన్4లో రూ.1409 కోట్లతో నిర్మించిన నాలుగు వరుసల నేషనల్ హైవేను ప్రారంభించారు. తర్వాత రూ.400 కోట్లతో చేపట్టే సివిల్ ఏవియేషన్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ప్రారంభించారు. మిర్యాలగూడ-కోదాడ హైవేపై రూ.323 కోట్ల ఖర్చుతో ఏర్పాటు చేసిన విస్తరణ రోడ్డును కూడా జాతికి అంకితం చేశారు.
హైదరాబాద్-సికింద్రాబాద్ మధ్య రూ.1165 కోట్లతో ఏర్పాటు చేసిన ఎంఎంటీఎస్ ఫేజ్-2 పనులు ప్రారంభించారు. అలాగే.. ఘట్‌కేసర్-లింగంపల్లి మధ్య ఎంఎంటీఎస్ రైలు ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో ప్రధాని మోదీ మాట్లాడారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందన్నారు. అంతకుముందు రోజైన సోమవారం.. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో రూ.56 వేల కోట్ల విలువైన పనులను మోదీ ప్రారంభించిన సంగతి తెలిసిందే.