PM MODI: దేశాన్ని వెనుకడుగు వేయనివ్వం.. ఎన్నికలకు ముందు లోక్‌సభలో ప్రధాని చివరి స్పీచ్..

గత ఏడాది నిర్వహించిన జీ20 సమావేశం వల్ల దేశ ప్రతిష్ట మరింత పెరిగింది. ప్రశ్నాపత్రాల లీకేజీ యువత పాలిట శాపంగా మారింది. ఈ విషయంలో కఠిన చట్టం చేసి, యువతకు అన్యాయం జరగకుండా చర్యలు తీసుకున్నాం.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 10, 2024 | 08:58 PMLast Updated on: Feb 10, 2024 | 9:00 PM

Pm Modis Last Address To 17th Lok Sabha Ram Mandir Sengol Article 370 Mentioned

PM MODI: తామెప్పుడూ దేశాన్ని వెనుకడుగు వేయనివ్వలేదన్నారు ప్రధాని మోదీ. 17వ లోక్‌సభను దేశం తప్పకుండా ఆశీర్వదిస్తుందన్నారు. త్వరలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా లోక్‌సభ సమావేశాల చివరి రోజు ప్రధాని సభలో.. అయోధ్య రామమందిర తీర్మానంపై మాట్లాడారు. ఈ లోక్‌సభకు సంబంధించి ప్రధానిగా ఇదే తన చివరి ప్రసంగం. ఈ ప్రసంంలో తమ పాలన గురించి, దేశం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.

PAWAN KALYAN: ఢిల్లీకి పవన్.. బీజేపీ నేతలతో సోమవారం భేటీ..

”ఎన్నో ఏళ్ల కల అయిన నూతన పార్లమెంట్ భవనాన్ని నిర్మించుకున్నాం. సెంగోల్‌ను స్థాపించుకున్నాం. పేపర్‌లెస్ పార్లమెంట్, డిజిటలైజేషన్.. సభలోని సభ్యులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. గతంతో పోలిస్తే పార్లమెంట్‌కు హాజరయ్యే సభ్యుల సంఖ్య పెరిగింది. గత ఏడాది నిర్వహించిన జీ20 సమావేశం వల్ల దేశ ప్రతిష్ట మరింత పెరిగింది. ప్రశ్నాపత్రాల లీకేజీ యువత పాలిట శాపంగా మారింది. ఈ విషయంలో కఠిన చట్టం చేసి, యువతకు అన్యాయం జరగకుండా చర్యలు తీసుకున్నాం. ఇప్పుడు దేశవ్యాప్తంగా మార్పు కనిపిస్తోంది. ఈ ఐదేళ్లలో పేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకు అనేక కార్యక్రమాలు చేపట్టాం. కరోనాలాంటి విపత్కర పరిస్థితుల్ని సమర్ధవంతంగా ఎదుర్కొన్నాం. అంతరిక్ష రంగంలో మనం సత్తా చాటాం. మార్పు దిశగా భారత్ కీలక ముందడుగు వేసింది. రీఫామ్స్, ట్రాన్స్‌ఫామ్స్, పర్‌ఫామ్స్ లక్ష‌్యంగా ముందుకు వెళ్తున్నాం. గత పదేళ్లలో దేశ ఉత్పాదకత పెరిగింది.

ఉగ్రవాద నిర్మూలనకు తీసుకున్న చర్యల వల్ల కాశ్మీర్‌లో శాంతి పెరిగింది. మహిళల జీవితాల్లో మార్పు కోసం నారీ శక్తి వందన్ చట్టం తీసుకొచ్చాం. త్రిపుల్ తలాక్ తొలగించి, ముస్లిం మహిళల హక్కులను కాపాడాం. మేం చేసిన పనులు చూసి ముస్లిం ఆడపడుచులు మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు. ఆర్టికల్ 370 తొలగింపుతో రాజ్యాంగ నిర్మాతల ఆత్మకూ శాంతి దొరికింది. వికసిత్ భారత్ ఫలాలు భావితరాలకు అందుతాయి. భారత్.. మరో పాతిక సంవత్సరాల్లో అభివృద్ధి చెందిన దేశంగా నిలుస్తుంది. రాబోయే పాతికేళ్లు దేశానికి చాలా కీలకం. ఆర్థిక సంస్కరణల ప్రక్రియలో ఎంపీలంతా భాగస్వాములయ్యారు” అని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.