J&K Modi Tour : నేడు, రేపు జమ్మూ కాశ్మీర్‌లో ప్రధాని మోదీ పర్యటన.. రేప్ దాల్ లేక్ వద్ద యోగా దినోత్సవ వేడుకలు
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈ రోజు జమ్మూ/కాశ్మీర్‌లో పర్యటించనున్నారు. మూడో సారి ప్రధాని బాధ్యతలు చేపట్టాక మోదీ తొలిసారిగా జమ్మూకశ్మీర్‌లో రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. ఈ ఏడాది జమ్మూ కాశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇటు కేంద్రంలో ఎన్డీఏ మూడవ సారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇక 2018 జమ్మూ కాశ్మీర్‌లో బీజేపీ-పిడీపితో పొత్తు విడిపోయింది.
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈ రోజు జమ్మూ/కాశ్మీర్‌లో పర్యటించనున్నారు. మూడో సారి ప్రధాని బాధ్యతలు చేపట్టాక మోదీ తొలిసారిగా జమ్మూకశ్మీర్‌లో రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. ₹1500కోట్లు రోడ్డు మౌలిక సదుపాయాలు, నీటి సరఫరా పథకాలు, ఉన్నత విద్యలో మౌలిక సదుపాయాలు తదితర ప్రాజెక్టులు.. అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడం సహా ఆరు ప్రభుత్వ డిగ్రీ కాలేజీలకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. కేంద్రపాలిత ప్రాంతంలో తన పర్యటన సందర్భంగా, ప్రధాని మోదీ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. వ్యవసాయం/అనుబంధ రంగాల ప్రాజెక్ట్ (JKCIP)లో పోటీతత్వ అభివృద్ధిని కూడా ఆయన ప్రారంభించనున్నారు.
- దాల్ లేక్ వద్ద యోగా దినోత్సవ వేడుకలు..
ఇక రేపు శ్రీనగర్‌లోని దాల్ లేక్ ఒడ్డున ఉన్న (షేర్-ఇ-కశ్మీర్) ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ సెంటర్ లో 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ (ఐడీవై) వేడుకలకు నాయకత్వం వహించనున్నారు. ఇటీవల ఉగ్రదాడులు జరిగిన నేపథ్యంలో మోదీ పర్యటనకు ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రధాని మోదీ శుక్రవారం అక్కడ యోగా చేసి ప్రసంగించనున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో లోయలో భద్రతను కట్టుదిట్టం చేశారు. శ్రీనగర్‌ను ‘తాత్కాలిక రెడ్ జోన్’ గా ప్రకటించారు. ఈ ప్రాంతంలో డ్రోన్‌లు/క్వాడ్‌కాప్టర్‌ల రెండు రోజుల పాటు నిషేధించారు.
ప్రధాని కాశ్మీర్ పర్యటన నేపథ్యంలో.. ప్రధాని భద్రతా దృశ్య బారాముల్లా జిల్లాలో భద్రతా దళాలు సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ ఆపరేషన్ లో ఇద్దరు ఉగ్రవాదులను ఎన్‌కౌంటర్ చేశారు. ప్రధాని మోదీ జమ్మూ కాశ్మీర్ పర్యటన ప్రారంభం అవుతుండడంతో ఆపరేషన్ కొనసాగుతోంది.
- జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు..
ఈ ఏడాది జమ్మూ కాశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇటు కేంద్రంలో ఎన్డీఏ మూడవ సారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇక 2018 జమ్మూ కాశ్మీర్‌లో బీజేపీ-పిడీపితో పొత్తు విడిపోయింది. ఆ తరువాత నుంచి జమ్మూ కాశ్మీర్ లో గవర్నర్ పాలన నడుస్తుంది. కాగా ఈ సారి రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించడంతో.. ఎలగైన జమ్మూ కాశ్మీర్ లో కాషాయ జెండా ఎగరవేయాలని.. ప్రధాని మోదీ కంకణం కట్టుకున్నట్లు తెలుస్తుంది.