Pocharam Srinivas Reddy : రాహుల్ గాంధీతో పోచారం భేటి.. మంత్రివర్గంలోకి పోచారం శ్రీనివాస్ రెడ్డి.. ?
ఇటీవల కాంగ్రెస్ కండువా కప్పుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం.. సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ఢిల్లీకి వెళ్లారు బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి..

Pocharam Bheti with Rahul Gandhi..Pocharam Srinivas Reddy in the cabinet..?
ఇటీవల కాంగ్రెస్ కండువా కప్పుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం.. సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ఢిల్లీకి వెళ్లారు బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి.. ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు. సీఎం రేవంత్ ఆయనతో పాటు ఉన్నారు. నిన్న జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ ఆదివారం రాత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. మరో 20 మంది MLAలు తమతో చేరుతారని కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు ఈ చేరికలతో కాంగ్రెస్ బలం 64 నుంచి 70కి చేరింది.
మంత్రి పదవి పక్క…
రాష్ట్ర కేబినెట్‌లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డిని తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఆయనకు మంత్రి పదవి ఇచ్చేందుకు కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి ఎవరూ మంత్రివర్గంలో లేకపోవడంతో ఆయనను తీసుకుంటున్నట్లు టాక్.