ఓ వైపు వరదలు మరో వైపు పోలీసుల వేట…!

తెలుగుదేశం పార్టీ ఆఫీసుపై దాడి చేసిన కేసులో పోలీసులు సీరియస్ గా దృష్టి సారించారు. ఈ కేసులో వైసీపీ నేతలను గురిపెట్టిన పోలీసులు ఒక్కొక్కరిని అదుపులోకి తీసుకుంటున్నారు. మాజీ ఎంపీ నందిగం సురేష్ ను పోలీసులు అరెస్ట్ చేసారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 5, 2024 | 05:39 PMLast Updated on: Sep 05, 2024 | 5:39 PM

Police Search Operation For Ycp Leaders

తెలుగుదేశం పార్టీ ఆఫీసుపై దాడి చేసిన కేసులో పోలీసులు సీరియస్ గా దృష్టి సారించారు. ఈ కేసులో వైసీపీ నేతలను గురిపెట్టిన పోలీసులు ఒక్కొక్కరిని అదుపులోకి తీసుకుంటున్నారు. మాజీ ఎంపీ నందిగం సురేష్ ను పోలీసులు అరెస్ట్ చేసారు. ఆయనకు కోర్ట్ 14 రోజుల రిమాండ్ విధించింది. అలాగే ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే విజయవాడలో పలువురు వైసీపీ నేతలను కూడా అదుపులోకి తీసుకున్నారు.

త్వరలోనే మరికొందరు నేతల మీద కూడా దృష్టి పెట్టె అవకాశం ఉంది. విజయవాడ వైసీపీ నేత దేవినేని అవినాష్ ను కూడా అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలా ఉంటే చంద్రబాబు ఇంటిపై దాడి చేసిన కేసులో వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. పలు బృందాలను ఇప్పుడు హైదరాబాద్ కు పంపించారు పోలీసులు. అటు విమానాశ్రయాల నుంచి తప్పించుకోకుండా లుకౌట్ నోటీసులు జారీ చేసారు.