KCR Convoy : మాజీ సీఎం కేసీఆర్ బస్సును ఆపీన పోలీసులు..
ఇవాళ రాష్ట్రంలో సూర్యాపేట, నల్గొండ, జనగామ, ప్రాంతాల్లో పంట నష్టాన్ని పరిశీలించేందుకు కేసీఆర్ బయల్దేరిన విషయం తెలిసిందే.. ఎర్రవల్లి ఫాంహౌస్ నుంచి బస్సులో బయల్దేరి సూర్యపేటకు వెళ్లారు.

Police stopped former CM KCR's bus.
బీఆర్ఎస్ అధినేత తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ప్రయాణిస్తున్న బస్సును పోలీసులు తనిఖీలు చేశారు.
ఇక విషయంలోకి వెళితే.. ఇవాళ రాష్ట్రంలో సూర్యాపేట, నల్గొండ, జనగామ, ప్రాంతాల్లో పంట నష్టాన్ని పరిశీలించేందుకు కేసీఆర్ బయల్దేరిన విషయం తెలిసిందే.. ఎర్రవల్లి ఫాంహౌస్ నుంచి బస్సులో బయల్దేరి సూర్యపేటకు వెళ్లారు. దేవరుప్పల మండలం ధరావత్ తండాలో ఎండిపోయిన పంటలను పరిశీలించిన కేసీఆర్ అనంతరం సూర్యపేట వైపునకు బయలు దేరారు. ఈ తరుణంలోనే… సూర్యాపేట జిల్లా ఈదుల పర్రె తండా చెక్ పోస్ట్ వద్ద మాజీ సీఎం కేసీఆర్ బస్సును తనిఖీ చేశారు పోలీసులు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో, బస్సును తనిఖీ చేస్తున్నట్టు పోలీసులు కేసీఆర్ కు తెలిపారు. దాంతో కేసీఆర్ వారికి సహకరించారు. బస్సును పూర్తిగా తనిఖీ చేసిన పోలీసులు, కేసీఆర్ కాన్వాయ్ లోని ఇతర వాహనాలను కూడా తనిఖీ చేశారు. అనంతరం బస్సులో ఏం లేకపోవడంతో పొలీసులు వెనుదిరిగారు. అనంతరం కేసీఆర్ కాన్వాయ్ ముందుకు వెళ్లేందుకు అనుమతి ఇచ్చారు.