Sahithi Dasari: ఎన్నికల బరిలో హీరోయిన్.. చేవెళ్ల ఎంపీ బరిలో పొలిమేర నటి

పొలిమేర సినిమాతో ఫేమస్‌ ఐన దాసరి సాహితి కూడా ఎన్నికల్లో పోటీ చేస్తోంది. చేవెళ్ల పార్లమెంట్‌ నుంచి సాహితీ ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా నామినేషన్‌ వేసింది. రాజేంద్రనగర్‌లోని ఆర్వో కార్యాలయంలో నామినేషన్ నామినేషన్‌ డాక్యుమెంట్స్‌ దాఖలు చేసింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 27, 2024 | 02:14 PMLast Updated on: Apr 27, 2024 | 2:14 PM

Polimera 2 Actress Sahithi Dasari Contesting As Mp From Chevella

Sahithi Dasari: సినీ సెలబ్రిటీలు రాజకీయాల్లోకి రావడం ఈ మధ్య కామన్‌ ఐపోయింది. కొందరు రాజకీయ నాయకులకు ప్రచారం చేస్తుంటే కొందరు మాత్రం నేరుగా పార్టీల్లో జాయిన్‌ అవుతున్నారు. ఇంకొందరు ఏకంగా నామినేషన్లు కూడా వేస్తున్నారు. ఇదే క్రమంలో పొలిమేర సినిమాతో ఫేమస్‌ ఐన దాసరి సాహితి కూడా ఎన్నికల్లో పోటీ చేస్తోంది.

TELANGANA NOMINATIONS: పార్లమెంట్ బరిలో ఎంతమంది..? ఈ నియోజకవర్గంలోనే 114 మంది పోటీ

చేవెళ్ల పార్లమెంట్‌ నుంచి సాహితీ ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా నామినేషన్‌ వేసింది. రాజేంద్రనగర్‌లోని ఆర్వో కార్యాలయంలో నామినేషన్ నామినేషన్‌ డాక్యుమెంట్స్‌ దాఖలు చేసింది. పుట్టింది ఏపీలో ఐనా హైదరాబాద్‌లోనే సెటిల్‌ అయ్యింది సాహితీ ఫ్యామిలీ. ఓ పక్క మోడలింగ్‌ చేస్తూ మరోపక్క సినిమాల్లో కూడా నటిస్తోంది. మేకసూరి అనే సినిమాతో నటిగా సాహితీ సినీ ప్రయాణం మొదలైంది. ఆ తర్వాత సోలో బతుకే సో బెటర్​, భోళా శంకర్​, మా ఊరి పొలిమేర, సర్కార్​ నౌకరి లాంటి చిత్రాల్లో నటించారు. అయితే సినిమా విషయానికి వస్తే పొలిమేర, పొలిమేర 2 సినిమాల్లో దాసరి సాహితీ తన నటనతో ఆకట్టుకుంది. పొలిమేర మొదటి పార్ట్‌లో గెటప్ శ్రీను భార్య రాములు క్యారెక్టర్‌లో నటించింది. సీక్వెల్‌లో రాజేశ్‌తో కలిసి నటించింది.

ఫస్ట్‌ పార్ట్‌ కంటే సెకండ్‌ పార్ట్‌ లోనే సాహితికి ఎక్కువ పేరు వచ్చింది. కొన్ని రోజులుగా అప్పుడప్పుడు రాజకీయాలపై స్పందిస్తూనే ఉంది సాహితీ. రీసెంట్‌గా కూడా రాజకీయల గురించి ఇట్రెస్టింగ్‌ కామెంట్స్‌ చేసింది. ఇప్పుడు ఏకంగా ఎంపీ అభ్యర్థిగా నామినేషన్‌ వేసి అందరినీ షాక్‌కు గురి చేసింది. సాహితీ ఫ్యామిలీలో కూడా ఎవరు పాలిటిక్స్‌లో లేరు. కానీ ఆమె మాత్రం ఇలాంటి నిర్ణయం తీసుకుంది. సినిమాల్లో సాహితిని ఆదరించిన తెలుగు ప్రజలు రాజకీయాల్లో ఎలాంటి రిజల్ట్‌ ఇస్తారో చూడాలి.