Kumari Aunty : ఏపీలో కుమారి ఆంటీతో పాలిటిక్స్ – వైసీపీ, టీడీపీ…ఎవరికి నచ్చినట్టుగా…

హైదరాబాద్ లో స్ట్రీట్ ఫుడ్ స్టాల్ (Street Food Stall) వ్యాపారి కుమారీ ఆంటీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో సంచలనం అయ్యారు. ఆమెను పొలిటికల్ స్టార్ క్యాంపెయిన్స్ గా చేశాయి... వైసీపీ(YCP), టీడీపీ(TDP)లు. కుమారి ఆంటీ వీడియోలకు మీమ్స్ జోడించి... ఆ రెండు పార్టీల సోషల్ మీడియాల్లో తెగ ప్రచారం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఏ పార్టీకి ఆ పార్టీ తమకు అనుకూలంగా మార్చుకొని క్యాంపెయిన్ చేసుకుంటున్నాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 2, 2024 | 10:54 AMLast Updated on: Feb 02, 2024 | 10:54 AM

Politics With Kumari Aunty In Ap Ycp Tdp As Anyone Likes

హైదరాబాద్ లో స్ట్రీట్ ఫుడ్ స్టాల్ (Street Food Stall) వ్యాపారి కుమారీ ఆంటీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో సంచలనం అయ్యారు. ఆమెను పొలిటికల్ స్టార్ క్యాంపెయిన్స్ గా చేశాయి… వైసీపీ(YCP), టీడీపీ(TDP)లు. కుమారి ఆంటీ వీడియోలకు మీమ్స్ జోడించి… ఆ రెండు పార్టీల సోషల్ మీడియాల్లో తెగ ప్రచారం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఏ పార్టీకి ఆ పార్టీ తమకు అనుకూలంగా మార్చుకొని క్యాంపెయిన్ చేసుకుంటున్నాయి.

సోషల్ మీడియాలో కుమారి ఆంటీ(Kumari Aunty)పై రచ్చ ఆగడం లేదు. హైదరాబాద్ లో ఆమె చేస్తున్న స్ట్రీట్ ఫుడ్ బిజినెస్ (Business) కు బ్రేక్ పడగా… ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి జోక్యంతో మళ్ళీ కంటిన్యూ అవుతోంది. రోజుకి 60 వేల రూపాయలకు పైగా ఫుడ్ బిజినెస్ చేస్తున్న కుమారీ ఆంటీని ఇంటర్వ్యూ చేయడానికి మీడియా, సోషల్ మీడియా క్యూ కట్టింది. దాంతో ఆమె రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ అయిపోయింది. అయితే తనకు ఏ ఆస్తులు లేవనీ… ఏపీలో జగనన్నఇచ్చిన ఇల్లే ఉందని చెప్పిందామె. ఆ తర్వాత ట్రాఫిక్ కి ఇబ్బందిగా మారిందని బిజినెస్ క్లోజ్ చేయాలని పోలీసులు కోరారు. జగనన్న ఇల్లు ఉందన్న కామెంట్స్ ని వైసీపీ సోషల్ మీడియా మొదట అనుకూలంగా రాసుకుంది. ఆ తర్వాత బిజినెస్ క్లోజ్ అయ్యాక… రేవంత్ రెడ్డి… చంద్రబాబు శిష్యుడు కాబట్టి… కుమారి ఆంటీ జగనన్న ఇల్లు గురించి చెప్పిందనే మూసి వేయించాడని… రివర్స్ ఎటాక్ చేసింది వైసీపీ. అక్కడి నుంచి కుమారి ఆంటీ ఏపీలో వైసీపీకి పొలిటికల్ క్యాంపెయినర్ గా మారింది.

ఆ తర్వాత వచ్చిన మరో వీడియోతో… టీడీపీ కూడా కుమారీ ఆంటీని తమ పార్టీకి చెందిన వ్యక్తిగా ఓన్ చేసుకుంది. మీరు అభిమానించే పార్టీ ఏదని అడిగితే… తనకు ఓటు హక్కు వచ్చినప్పటి నుంచీ… చంద్రబాబు(Chandrababu)కే ఓటేశాను అని కుమారి ఆంటీ చెప్పడం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ‘ఆవిడ క్లియర్ గానే ఉంది.. వీళ్ళకి చాలా సస్పెన్స్ తర్వాత అర్థమైంది’ అంటూ అదుర్స్ మూవీలో బ్రహ్మానందం (Brahmanandam) డైలాగ్ ని గుర్తు చేస్తూ… ఇప్పుడు పేటీఎం బ్యాచ్ పరిస్థితి ఏంటో అని టీడీపీ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఎక్స్ లో ఈ వీడియో ట్రెండింగ్ చేస్తున్నారు. కుమారి ఆంటీకి జగన్ ఇల్లు ఇచ్చాడని వైసీపీ ప్రచారం చేసుకుంటే… ఆమె టీడీపీ అభిమాని అని.. తెలుగుదేశం క్యాంపెయిన్ చేస్తోంది.

ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ముందు కుమారీ ఆంటీ… వైసీపీ, టీడీపీలకు పొలిటికల్ (AP Politics) క్యాంపెయినర్ గా మారింది. సోషల్ మీడియా(Social Media)లో ఫేస్ అయిన ఆమెను తమ రాజకీయ ప్రచారానికి ఈ రెండు పార్టీలు తెగ వాడేసుకుంటున్నాయి. కానీ తెలంగాణలో ఏ పార్టీ కూడా కుమారీ ఆంటీని పట్టించుకోవడం లేదు.