Ponguleti Srinivas Reddy : పొంగులేటి పక్కా కమ్మ వ్యతిరేకి.. ఆయన నిజస్వరూపం ఇదే
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy)... రాజకీయాలకతీతంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తనకంటూ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్నారు. ఖమ్మం జిల్లా జనమంతా శ్రీనన్న గౌరవంగా పిలుచుకుంటారు. నమ్ముకున్నోడికి ఏ ఆపద వచ్చినా... క్షణాల్లో అక్కడ వాలిపోయి.. వారి సమస్యకు పరిష్కారం చూపించడమో.. సాయం చేయడం చేస్తుంటారు. అందుకే పార్టీలకు అతీతంగా ఆయనకు జనబలం ఉందని అనుకుంటుంటారు అంతా...
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy)… రాజకీయాలకతీతంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తనకంటూ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్నారు. ఖమ్మం జిల్లా జనమంతా శ్రీనన్న గౌరవంగా పిలుచుకుంటారు. నమ్ముకున్నోడికి ఏ ఆపద వచ్చినా… క్షణాల్లో అక్కడ వాలిపోయి.. వారి సమస్యకు పరిష్కారం చూపించడమో.. సాయం చేయడం చేస్తుంటారు. అందుకే పార్టీలకు అతీతంగా ఆయనకు జనబలం ఉందని అనుకుంటుంటారు అంతా. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ (Congress) సత్తా చాటింది అంటే.. అది వన్ అండ్ ఓన్లీ పొంగులేటి వల్లే అనే అభిప్రాయం ఉంది చాలామందిలో. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే.. ఆయనకు కీలక మంత్రిత్వ శాఖ ఇచ్చింది కూడా అందుకే. కాంగ్రెస్లో ఇప్పుడు వన్ ఆఫ్ ది కింగ్ మేకర్ (King Maker) అయ్యారు ఆయన. అలాంటి పొంగులేటికి ఇప్పుడు షాక్ తగిలింది. పొంగులేటి కమ్మ వ్యతిరేకి అంటూ… ఖమ్మం జిల్లాలో వెలిసిన పోస్టర్లు కలకలం రేపుతున్నాయి.
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) నిజ స్వరూపం అంటూ కొందరు లేఖలు సృష్టించడం కలకలం రేపుతోంది. కమ్మ సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతుందంటూ వాటిలో ఆవేదన వ్యక్తం చేశారు. పాలు అమ్ముకునే స్థాయి నుంచి వేల కోట్ల రూపాయలు పొంగులేటి ఎలా సంపాదించారని ఆ లేఖలో రాసుకొచ్చారు. పొంగులేటి కమ్మవాళ్ళకు వ్యతిరేకం. కల్లూరు లో 1995లో పాలమ్మేవాడు. నామా నాగేశ్వరరావు 60 ఏళ్లలో సంపాదించలేనిది.. పొంగులేటి అక్రమంగా పదేళ్లలో పదివేల కోట్లు.. అంటే రోజుకు మూడు కోట్ల రూపాయలు గత కాంగ్రెస్ ప్రభుత్వంలో దోచుకున్నారని రాశారు.. పనులు చేయకుండానే బిల్లులు చేయించుకోవడం ఆయన పని అని… ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఏజెంట్ గానే పొంగులేటి ఉన్నారని బాంబ్ పేల్చారు. అతని పేరు అతనే శ్రీనన్న అని పెట్టుకున్నాడు.
జనాల బలహీనతలను సొమ్ము చేసుకుంటాడని.. డబ్బులు, గడియారాలు, బట్టలు.. గిఫ్ట్ గా ఇవ్వడం చూసి అది ప్రేమ అనుకుంటే మోసపోయినట్లే అని.. పొంగులేటి గాలి తీశారు.. అప్పట్లోని కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పనులు చేయకుండానే ఆయన వందల కోట్ల రూపాయలు సంపాదించినట్లు లేఖలో రాసుకొచ్చారు. వైఎస్ జగన్‌కి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఏజెంట్ అంటూ వారు పేర్కొన్నారు. మువ్వా విజయ్ బాబుకి సముచిత స్థానం కల్పించలేదని లేఖలో చెప్పారు. ఖమ్మంలో నిర్మించనున్న రింగ్ రోడ్ పక్కన వేల ఎకరాలు కొనుగోలు చేసేందుకు పొంగులేటి ప్రయత్నం చేశారని అందులో చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ సర్కారులో పొంగులేటిదే పెత్తనం అంటూ అందులో తెలిపారు.
కమ్మ సామాజిక వర్గానికే ప్రాధాన్యం లేకపోతే మిగిలిన కులాల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. లేఖలు, పీడీఎఫ్ ద్వారా ప్రచారం చేయాలంటూ లేఖల్లో పిలుపునిచ్చారు. కనగండ్ల నాగభూషణం, కనకమేడల ప్రసాద్ రావు, మేడ తిరునాదరావు, కాటేపల్లి కోటేశ్వరరావు, నల్ల మోతు కృష్ణ మూర్తి, దమ్మాలపాటి తిరుమలరావు, నూతలపాటి వెంకట అప్పారావు పేరుతో లేఖలు ఉన్నాయి. పాలేరు నియోజకవర్గంలోని నేల కొండపల్లిలో ఈ లేఖలు కనపడ్డాయి. ప్రముఖులకు లేఖలను పోస్ట్ చేశారు. ఫ్రమ్ అడ్రసు అంటూ ఖమ్మం జిల్లా కలెక్టర్ కార్యాలయం పేరు రాశారు.