Ponguleti Srinivas: కాంగ్రెస్‌లోకి పొంగులేటి.. ముహూర్తం కూడా ఫిక్స్‌!?

కర్ణాటక ఎన్నికల ఫలితాలు అప్పుడే తెలంగాణపై ప్రభావం చూపించడం మొదలు పెట్టాయి. చాలా రోజుల నుంచి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తున్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌ కాంగ్రెస్‌లో చేరేందుకు గ్రౌండ్‌ ప్రిపేర్‌ చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ విషయాన్ని తన ముఖ్య అనుచరులతో షేర్‌ చేసుకున్నారట పొంగులేటి. జూన్‌ రెండో వారంలో తన అనుచరులతో కలిసి భారీ స్థాయిలో కాంగ్రెస్‌లో చేరబోతున్నారట.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: May 15, 2023 | 04:01 PMLast Updated on: May 15, 2023 | 4:01 PM

Ponguleti Srinivas Reddy Join In Congress

తెలంగాణలో రెబల్‌ క్యాండెట్స్‌ కాంగ్రెస్‌ బీజేపీ చుట్టూ తిరిగితే.. పొంగులేటి మాత్రం ఆ రెండు పార్టీలను తన చుట్టూ తిప్పుకున్నారు. ఇప్పటికే బీజేపీ చేరికల కమిటీ పొంగులేటి ఇంటికి వెళ్లి మరీ ఆయనను బీజేపీలోకి ఇన్వైట్‌ చేసింది. ఇటు కాంగ్రెస్‌ నేతలు కూడా కాంగ్రెస్‌లో చేరాలంటూ పొంగులేటిని సంప్రదిస్తూ వస్తున్నారు. అయితే ఈ విషయంలో పొంగులేటి చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేసినట్టు తెలుస్తోంది. కర్ణాటక ఎలక్షన్‌ రిజల్ట్‌ తరువాత కాంగ్రెస్‌ పరిస్థితి చూసి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

ఈ మధ్య కాలంలో బీజేపీని ఈ స్థాయిలో ఓడించిన పార్టీ కాంగ్రెస్‌ మాత్రమే. ఈ ఎన్నికల ఎఫెక్ట్‌ వచ్చే తెలంగాణ ఎన్నికలు, లోక్‌సభ ఎన్నికలపై ఖచ్చితంగా ఉంటుంది. అంతేకాదు కర్ణాటక గెలుపుతో కాంగ్రెస్‌ మంచి ఊపులో ఉంది. సౌత్‌లో అధికారంలో ఉన్న ఒక్క రాష్ట్రాన్ని కూడా చేజార్చుకుని బీజేపీ డైలమాలో ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్‌తో కలిసి నడవడమే బెటర్‌ అని పొంగులేటి నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. దీనికి తోడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పొంగులేటికి మంచి ఫాలోయింగ్‌ ఉంది.

జిల్లా రాజకీయాలను శాసించగలిగే ఓట్‌బ్యాంక్‌ ఉంది. అటు కాంగ్రెస్‌ హయాంలో ఖమ్మం జిల్లా కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉండేది. ఇప్పటికీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వైఎస్‌ఆర్‌ అభిమానులు ఉంటారు. ఈ రెండు ఈక్వేషన్స్‌ను కంపేర్‌ చేసుకుంటే ఏ రకంగా చూసినా పొంగులేటి కాంగ్రెస్‌కు వెళ్లడమే ఆయనకు ప్లస్‌ అవుతుంది. ఈ కారణంగానే ఆయన కాంగ్రెస్‌ కండువా కప్పుకునేందుకు నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.

ఇదే జరిగితే వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్‌ క్లీన్‌స్వీప్‌ చేయడం ఖాయం. ఐతే దీని గురించి పొంగులేటి గానీ ఆయన వర్గం నుంచి గానీ ఎలాంటి అధికారక ప్రకటన రాలేదు. కానీ ఆయన సన్నిహిత వర్గాల నుంచి గుసగుసలు గట్టిగానే వినిపిస్తున్నాయి. కాంగ్రెస్‌లో చేరే విషయం గురించి పొంగులేటి ఎప్పుడు అధికారిక ప్రకటన చేస్తారోనని ఆయన అభిమానులే కాదు.. కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు కూడా ఆతృతగా ఎదురుచూస్తున్నారు.