Ponguleti Srinivas: పొంగులేటికి కాంగ్రెస్ ఇచ్చిన ఆఫర్ ఇదే..
ఓ త్రిల్లర్ సినిమాను మించిన సస్పెన్స్ పొంగులేటి పొలిటికల్ డెసిషన్ విషయంలో జరిగింది. పొంగులేటి బీజేపీలో చేరబోతున్నారంటూ బీజేపీ వాళ్లు. కాదు కాంగ్రెస్‌లో ప్లేస్ రిజర్వ్ చేశామంటూ కాంగ్రెస్ వాళ్లు. దాదాపు రెండు మూడు నెలల నుంచి తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా ఉన్న పొంగులేటి చివరికి కాంగ్రెస్‌లో చేరబోతున్నట్టు క్లారిటీ ఇచ్చారు. జూన్ 8న తన అనుచరులతో కలిసి కాంగ్రెస్‌లోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు.
బీఆర్‌ఎస్ మీద వ్యతిరేకత ఉన్న రాజకీయ నేతలంతా కాంగ్రెస్, బీజేపీ చుట్టూ తిరిగితే.. పొంగులేటి శ్రీనివాస్ మాత్రం ఈ రెండు నేషనల్ పార్టీలను తన చుట్టు తిప్పుకున్నారు. కర్ణాటక ఫలితాల తరువాత తెలంగాణలో కాంగ్రెస్ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఆయన కాంగ్రెస్‌లో చేరబోతున్నట్టు తెలుస్తోంది. అయితే కాంగ్రెస్ నుంచి కూడా పొంగులేటికి భారీ ఆఫర్ ఇచ్చిందట అదిష్టానం. ప్రియాంక గాంధీ సరూర్‌నగర్‌లో సభ నిర్వహించిన సమయంలోనే ఈ హామీలు ఇచ్చినట్టు తెలుస్తోంది.
ఖమ్మం జిల్లాలో తనతో పాటు తన అనుచరులకు కూడా టికెట్లు వచ్చేలా ప్లాన్ చేసుకున్నారు పొంగులేటి. ఇప్పటికే జిల్లాలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్, ఓట్‌బ్యాంక్ ఉన్న పొంగులేటి కాంగ్రెస్‌లో చేరిన తరువాత కూడా తన గ్రిప్ మిస్ అవ్వకుండా ప్లాన్ చేసుకున్నారు. ఖమ్మం జిల్లా నుంచి తన ముఖ్య అనుచరులు ఉన్న 10 అసెంబ్లీ సెగ్మెంట్లలో పొంగులేటి టికెట్లు కోరారట. దీనికి పార్టీ హైకమాండ్ కూడా ఒకే అన్నట్టు సమాచారం. భట్టి విక్రమార్క, పోడెం వీరయ్య నియోజకవర్గాలు మినహా కోరిన ప్రతీ స్థానాన్నీ పొంగులేటి అండర్‌లో ఉంచేందుకు పార్టీ పెద్దలు ఒప్పుకున్నారట. అంతే కాదు. తెలంగాణ కాంగ్రెస్‌లో మంచి స్థానం. వచ్చే ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి వస్తే మంత్రి పదవి కూడా ఇస్తామని ఆఫర్ ఇచ్చారట.
ఇలాంటి ఆఫర్లేవి బీజేపీ నుంచి పొంగులేటికి అందినట్టుగా కనిపించలేదు. దానికి తోడు బీజేపీకి గ్రౌండ్ స్థాయిలో నాయకులు లేరు. బీజేపీలోకి వెళ్తే పార్టీ బాధ్యత మొత్తం తానే మొయ్యాలి. అలా చేసినా పార్టీ అధికారంలోకి వస్తుందో లేదో తెలియదు. అదే కాంగ్రెస్‌లో అయితే ఎట్‌లీస్ట్ చాన్స్ ఉంది. దీంతో ఆయన కాంగ్రెస్‌లో చేరేందుకే రెడీ అయ్యారు. అయితే ఇక్కడిదాకా అంతా బానే ఉంది. కానీ ఇలా ఒక నాయకుడి కోసం ఏకంగా జిల్లాకు జిల్లాను ఆయన చేతిలో పెడితే పరిస్థితి ఏంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్‌గా ఉన్న భట్టి విక్రమార్క ఖమ్మం జిల్లాలకు చెందిన వ్యక్తే, సీనియర్ నేత పోడెం వీరయ్య కూడా ఖమ్మం జిల్లా నుంచే ఉన్నారు. ఇప్పుడు జిల్లాలో అన్ని సీట్లు పొంగులేటికి కేటాయిస్తే ఆటోమేటిక్‌గా ఈ ఇద్దరు నేతలు తమ గ్రిప్ కోల్పోయే అవకాశం ఉంది. ఇది అటు తిరిగీ ఇటు తిరిగీ మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చీలికలు తెచ్చే ప్రమాదం ఉంది. ఇలాంటి సిచ్యువేషన్ కాంగ్రెస్ హైకమాండ్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం కాంగ్రెస్ శ్రేణుల్లో కాస్త ఆందోళన కలిగిస్తోంది. జిల్లా మొత్తం ఒక్కరి చేతిలోనే పెట్టేస్తే టికెట్లు ఆశించి పార్టీకోసం పని చేసినవారి పరిస్థితి ఏంటని ప్రశ్నించకనే ప్రశ్నిస్తున్నారు కొందరు కాంగ్రెస్ లీడర్లు.