Ponguleti Srinivasa Reddy: వివాదంలో పొంగులేటి.. స్మగ్లింగ్ కేసులో మంత్రి పొంగులేటి కొడుకు..
ముబిన్ అనే స్మగ్లర్.. హర్ష కోసం సింగపూర్ నుంచి 2 వాచ్‌లు తెప్పించాడు. పటెక్ ఫిలిప్, బ్రిగెట్ బ్రాండ్ లగ్జరీ వాచ్‌లను హర్ష ఆర్డర్ చేసినట్లు తెలుస్తోంది. భారత్‌లో దొరకని ఈ బ్రాండ్లను హర్ష కోసం తెచ్చాడు ముబిన్.

Ponguleti Srinivasa Reddy: తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుమారుడు.. హర్షా రెడ్డి వివాదంలో చిక్కుకున్నారు. హర్షకి చెన్నై కస్టమ్స్ అధికారులు నోటీసులు ఇచ్చారు. స్మగుల్డ్ గూడ్స్‌కు సంబంధించిన కేసులో ఏప్రిల్ 4న విచారణకు రావాలని ఆదేశించారు. ఐతే తనకు ఒంట్లో బాగా లేదని ఆ రోజు వెళ్లలేదు. ఏప్రిల్ 27 తర్వాత విచారణకు హాజరవుతానని పొంగులేటి హర్ష రిప్లై ఇచ్చారు.
MLA Tellam Venkat Rao: బీఆర్ఎస్‌కు మరో షాక్.. కాంగ్రెస్‌లోకి భద్రాచలం ఎమ్మెల్యే
ముబిన్ అనే స్మగ్లర్.. హర్ష కోసం సింగపూర్ నుంచి 2 వాచ్‌లు తెప్పించాడు. పటెక్ ఫిలిప్, బ్రిగెట్ బ్రాండ్ లగ్జరీ వాచ్‌లను హర్ష ఆర్డర్ చేసినట్లు తెలుస్తోంది. భారత్‌లో దొరకని ఈ బ్రాండ్లను హర్ష కోసం తెచ్చాడు ముబిన్. అయితే, ముబిన్ నుంచి రెండు వాచ్‌లు స్వాధీనం చేసుకున్న కస్టమ్స్ అధికారులు ఇప్పుడు హర్షకు నోటీసులు ఇచ్చారు. హర్షారెడ్డి కోసం తెచ్చిన ఒక్కో వాచ్ ఖరీదు కోటీ 75 లక్షల వరకు ఉంటుందని తెలుస్తోంది. ఈ వాచ్‌లకు హవాలా రూపంలో డబ్బు చెల్లించినట్లు ఆరోపణలు ఉన్నాయ్. ఫిబ్రవరి 5న కేసు నమోదు చేసిన చెన్నై కస్టమ్స్ అధికారులు.. దీనిపై దర్యాప్తు చేస్తున్నారు. ఇలా స్మగుల్డ్ గూడ్స్ రూపంలో తెచ్చిన వాచ్‌ల స్కామ్ విలువ వంద కోట్ల వరకూ ఉంటుందని అంచనా. ముబిన్, హర్షారెడ్డికి నవీన్ కుమార్ అనే వ్యక్తి మధ్యవర్తిత్వం వహించినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే నవీన్ కుమార్‌ని విచారించారు కస్టమ్స్ అధికారులు.
ఐతే స్మగ్లింగ్ అన్న విషయం తెలిసి తాను షాక్ అయ్యానని.. అసలీ వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేదని హర్ష అంటున్నారు. డెంగ్యూ కారణంగా ప్రస్తుతం ఆయన చికిత్స తీసుకుంటున్నారు. వైద్యుల సూచన మేరకు.. మరికొన్ని రోజులు విశ్రాంతి అవసరమని తెలుస్తోంది. దీంతో ఏప్రిల్ 27 తర్వాత విచారణకు హాజరవుతానని కస్టమ్స్ అధికారులకు హర్ష లేఖ రాయగా.. వాళ్లు అంగీకరించినట్లు తెలుస్తోంది. ఇక అటు స్మగ్లింగ్ వాచ్ కుంభకోణం వందల కోట్లకుపైనే ఉంటుందనే అంచనాలు వినిపిస్తున్నాయ్.