Pooja And Nidhi Agarwal: ఆ ఇద్దరు హీరోయిన్స్ అవుట్ ఫోకస్ అయిపోయినట్లేనా..?
టాలీవుడ్ లో పూజా హిగ్డే, నిధి అగర్వాల్ ఇద్దరి కెరియర్ కు బ్రేక్ పడినట్లే అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. దీనికి కారణం అవకాశాలు లేకపోవడమే అంటున్నారు సినిమా అభిమానులు.

Pooja Hegde and Nidhi Agarwal Carrier Fade Out In Tollywood
ఒక్క సినిమా హీరోయిన్ కెరీర్ ని మార్చేస్తుంది. హిట్ అయితే స్టార్ బ్యూటీగా ఫోకస్ అవుతుంది. ప్లాప్ అయితే ఐరెన్ లెగ్ గా మారిపోతుంది. అయితే ఒక్కప్పుడు స్టార్ బ్యూటీస్ గా సందడి చేసిన ఇద్దరు లేడీస్ ఇప్పుడు ఆఫర్స్ లో సైలెంట్ అయ్యారు. అంటే వీళ్ల కెరీర్ క్లైమాక్స్ కి చేరినట్టేనా?. పూజా హెగ్డే.. రెండేళ్ల క్రితం ఫుల్ స్వింగ్ లో ఉన్న బ్యూటీ. కానీ రాధేశ్యామ్ తర్వాత సీన్ మారింది. బ్యాక్ టు బ్యాక్ 6 సినిమాలు డిజాస్టర్ అవ్వడంతో పూజా కెరీర్ ఒక్కసారిగా డౌన్ అయిపోయింది. మహేష్ గుంటూరు కారంతో బౌన్స్ బ్యాక్ అవ్వలని చూస్తే ఆ ప్రాజెక్ట్ వచ్చినట్టే వచ్చి చేజారిపోయింది. పవన్ సినిమా కోసం పూజా తో చర్చలు జరిపిన హరీష్ కూడా లాస్ట్ మినిట్ లో హ్యాడ్ ఇచ్చాడు. దీంతో పూజా చేతిలో ఇప్పుడు ఒక్క సినిమా కూడా లేదు. బాలీవుడ్ చేసిన సినిమాలు కూడా ప్లాప్ అవ్వడంతో ఒకటి రెండు ఆఫర్లు వచ్చినట్లే వచ్చి కనిపించకుండా పోయాయి. దీంతో ఇప్పుడు పూజా హెగ్డే కెరీర్ క్లైమాక్స్ కి చేరినట్లు ప్రచారం.
పూజా లానే బ్యాడ్ టైం తో ఫైట్ చేస్తున్న మరో బ్యూటీ నిధి అగర్వాల్. సవ్యసాచి’ తో ఉవ్వెత్తున దూసుకొచ్చిన ఈ లేడీ .’ఇస్మార్ట్ శంకర్’ తో ఫస్ట్ హిట్ ని అకౌంట్ లో వేసుకుంది. తర్వాత కోలీవుడ్ లో రెండు మూడు సినిమాలు చేసింది. అయితే ఈ ఐదేళ్లలో నిధి సాధించింది ఏదైనా ఉందా? అంటే నో హిట్స్. మరిప్పుడు నిధి భవితవ్యం ఏంటి? అంటే చేతిలో ఉన్న సినిమాతో సక్సెస్ అందుకుని రేసులోకి వస్తే తప్ప నటిగా బిజీ అవ్వడం కష్టం. ప్రస్తుతం ఈ బ్యూటీ పవన్ కళ్యాణ్ ‘హరి హర వీరమల్లు’లో నటిస్తోంది. పవన్ రాజకీయాల్లో బిజీగా ఉండటంతో వీరమల్లుని తాత్కాలికంగా పక్కనబెట్టేసాడు . అవసరం అనుకుంటే వేరే సినిమాలు చేస్తున్నాడు తప్ప వీరమల్లు జోలికి పోవడం లేదు. దీంతో నిధి కెరీర్ కూడా అల్మోస్ట్ క్లైమాక్స్ కి చెరినట్టే తెలుస్తోంది.మరి అందం,అభినయం ఉన్న ఈ ఇద్దరు మళ్లీ ఎప్పటికి బౌన్స్ బ్యాక్ అవుతారో చూడాలి.