Pooja Hegde: అజ్ఞాతవాసి.. బాయ్ ఫ్రెండ్ తో పూజా హెగ్డే కారులో షికారు

ఈ బుట్టబొమ్మ పూజా.. కొంత కాలంగా బాలీవుడ్ నటుడు రోహన్ మెహ్రాతో రిలేషన్‌లో ఉన్నట్లు బాలీవుడ్ మీడియా కోడై కూస్తుంది. తాజాగా ఈ జంటకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 1, 2024 | 04:15 PMLast Updated on: Apr 01, 2024 | 4:45 PM

Pooja Hegde Spotted With Rumoured Boyfriend Boyfriend Rohan Mehra

Pooja Hegde: పూజా హెగ్డే మళ్లీ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లా దూసుకొచ్చేస్తుంది. ఈ బ్యూటీ చేతిలో ఇప్పుడు ఏకంగా మూడు సినిమాలున్నాయి. అదీ కాకుండా తెలుగులో నాగచైతన్యతో కలిసి మరో సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇలా చేతి నిండా ప్రాజెక్ట్‌లతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చేసింది. ఈ బుట్టబొమ్మ పూజా.. కొంత కాలంగా బాలీవుడ్ నటుడు రోహన్ మెహ్రాతో రిలేషన్‌లో ఉన్నట్లు బాలీవుడ్ మీడియా కోడై కూస్తుంది. తాజాగా ఈ జంటకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి.

Kurchi Madathapetti: వైరల్ వీడియో.. టెక్సాస్‌ ఈవెంట్‌లో ‘కుర్చీని మడత పెట్టి’కి డ్యాన్సులు..

పూజా హగ్డే తన రూమర్డ్ బాయ్ ఫ్రెండ్ రోహన్ మెహ్రాతో కలిసి కారులో వెళ్లిన వీడియో తెగ వైరల్ అవుతుంది. వీరిద్దరూ కలిసి పార్టీకి వెళ్లినట్లు తెలుస్తుంది. దాంతో పూజా, రోహన్‌ల సీక్రెట్ రిలేషన్ నిజమే అన్న వార్తలు సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి. ఇప్పటికే రెండు, మూడు సార్లు వీరిద్దరూ కలిసి కెమెరా కంట పడ్డారు కానీ.. పక్కన ఇద్దరు, ముగ్గురు ఫ్రెండ్స్ ఉండే వారు. కానీ ఈ సారి మాత్రం వీరిద్దరే కలిసి కనిపించడంతో వీళ్లది సీరియస్ రిలేషన్‌షిప్ అని పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరి దీనిపై క్లారిటీ రావాలంటే పూజా ఓపెన్ అయ్యే వరకు వేచి చూడాల్సిందే. బాలీవుడ్‌లోని ప్రామిసింగ్ యాక్టర్‌లలో రోహన్ మెహ్రా ఒకడు. బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో వినోద్ మెహ్రా కొడుకే ఈ రోహన్ మెహ్రా.

రణ్‌వీర్ సింగ్ హీరోగా నటించిన ‘బాజీరావు మస్తానీ’ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా వర్క్ చేసిన రోహన్ మెహ్రా.. ‘బాజాన్’ సినిమాలో సైఫ్ అలీఖాన్‌తో కలిసి నటించాడు. ప్రస్తుతం అద్భుత్ అనే సినిమా చేస్తున్నాడు. ఇక పూజా హెగ్డే విషయానికొస్తే ప్రస్తుతం ఈ బ్యూటీ హిందీలో రెండు సినిమాలు చేస్తుంది. అందులో ఒకటి ‘దేవా’ కాగా.. మరొకటి సునీల్ శెట్టి కొడుకు అహన్ శెట్టి హీరోగా నటిస్తున్న రొమ్ కామ్ సినిమాలో పూజా హీరోయిన్‌గా చేస్తుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. మరోవైపు నాగచైతన్యతో కలిసి రెండోసారి జోడీ కట్టడానికి రెడీ అయిపోయింది.