Gaddar: ఉద్యమించిన ప్రజాచైతన్యం.. అస్తమించిన విప్లవ కిరణం
గద్దర్ ఈ మూడు అక్షరాలు రాష్ట్రాన్ని మేలుకునేలా చేసింది. బ్రిటీష్ పాలకుల నుంచి పోరాటం చేస్తూ తన జీవిత ప్రస్థానాన్ని సాగించారు.

Popular singer Gaddar died after being admitted to Apollo Hospital due to heart attack
గత కొన్ని నెలలుగా గుండె జబ్బుకి చికిత్స పొందుతూ ఆదివారం అపోలో ఆసుపత్రిలో కన్నుమూశారు. ఈ వార్తను విన్న ప్రతి ఒక్కరూ షాక్ కి గురవుతున్నారు. గత రెండు రోజుల క్రిందటే గుండె ఆపరేషన్ చేశారు. సర్జరీ విజయవంతం అయిందని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ రోజు ఉదయం బీపీ పెరగడంతో పాటూ షుగర్ లెవెల్స్ ఒక్కసారిగా పడిపోవడంతో వెంటనే చికిత్స అందించారు. ఇలా చేసినప్పటికీ మధ్యాహ్నానికి శరీరంలోని అవయవాలు దెబ్బతినడంతో గద్దర్ కన్నుమూసినట్లు తెలిపారు.
ఈయన పూర్తి పేరు గుమ్మడి విఠల్ రావు, దళిత రచయిత, ప్రజా కవి, విప్లవ భావాన్ని నరనరాన ఇమడింపజేశారు. దేశానికి స్వాతంత్య్రం రాకముందు బ్రిటీష్ రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడిన పార్టీకి గుర్తుగా గదర్ కి ఆపేరును స్వీకరించడం జరిగింది. గత కొన్ని రోజుల క్రితం కూడా యాక్టీవ్ గా ఉన్నారు. తాజాగా జరిగిన రాహూల్ సభలో కూడా హాజరై రాహూల్ గాంధీని ఆలింగనం చేసుకొని ముద్దుకూడా పెట్టారు. రాజకీయాల్లోకి రావాలని, ప్రజా సేవ చేయాలని ఉద్దేశ్యంతో ఉన్నారు. ఎమ్మెల్యే అవ్వాలనేది తన చివరి కోరిక అని అన్నారు. తాను కన్న కల.. కలగానే మిగిలిపోయినందుకు చింతిస్తున్నారు ఆయన అభిమానులు.
T.V.SRIKAR