Posani Krishna Murali: తెలంగాణలో జనసేనకు టీడీపీ ఎందుకు మద్దతు ఇవ్వలేదు: పోసాని
ఏపీలో టీడీపీ కలలు కంటోంది. తెలంగాణలో కేసిఆర్ గెలిస్తే.. ఏపీలో జగన్ గెలుస్తాడు అని చెప్పలేరు. కానీ, కేసీఆర్ ఓడితే మాత్రం జగన్ కూడా ఓడిపోతారని అంటున్నారు. కెసిఆర్ ప్రభుత్వానికి, జగన్ ప్రభుత్వానికి సంబంధం ఏంటి..?

Posani Krishna Murali: ఏపీలో టీడీపీతో పొత్తులో ఉన్నామని చెప్పిన జనసేనకు తెలంగాణలో టీడీపీ ఎందుకు మద్దతు ఇవ్వలేదో చెప్పాలని ప్రశ్నించారు సినీ నటుడు పోసాని కృష్ణ మురళి. సోమవారం పోసాని మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా టీడీపీపై విమర్శలు చేశారు. ‘‘ఏపీలో టీడీపీ కలలు కంటోంది. తెలంగాణలో కేసిఆర్ గెలిస్తే.. ఏపీలో జగన్ గెలుస్తాడు అని చెప్పలేరు. కానీ, కేసీఆర్ ఓడితే మాత్రం జగన్ కూడా ఓడిపోతారని అంటున్నారు.
PAWAN KALYAN: నాదెండ్ల సహా జనసేన నేతల అరెస్టు.. పవన్ కళ్యాణ్ వార్నింగ్..
కెసిఆర్ ప్రభుత్వానికి, జగన్ ప్రభుత్వానికి సంబంధం ఏంటి..? ఏపీ, తెలంగాణ.. రెండు వేర్వేరు రాష్ట్రాలు అని టీడీపీ తెలుసుకోవాలి. టీడీపీకి సామర్ధ్యం ఉంటే తెలంగాణలో పోటీ చేయాలి కదా. తెలంగాణలో జనసేనకు టీడీపీ ఎందుకు సపోర్ట్ చేయలేదో చెప్పాలి. తప్పు చేసి చంద్రబాబు జైల్లో ఉంటే.. తన ప్రాధాన్యం పక్కన పెట్టి పవన్ సపోర్ట్ చేశాడు. ఏపీలో పవన్ సపోర్ట్ చేస్తునపుడు తెలంగాణలో టీడీపీ సపోర్ట్ చేయాలి కదా..? ఎందుకు చేయరు. చంద్రబాబులాంటి పొలిటీషియన్ ఎక్కడైనా ఉంటారా..? కాంగ్రెస్‌కు చేసింది జనసేనకు చేయొచ్చు కదా. తెలంగాణలో పవన్‌కు సపోర్ట్ చేయకుండా వాడుకుంటున్న టీడీపీ.. ఏపీలో ఆయన్ని వదిలేయాలి. కాపు సోదరులకు ముందు నుంచే చంద్రబాబు ముంచేస్తాడు అని చెబుతూనే ఉన్నా. గెలిచినా, ఓడినా పొత్తులో ఉన్న పార్టీకి ఓట్లు వేయించాలి కదా. పవన్ తన ఓట్లు అన్నీ చంద్రబాబుకి వేయాలని చెబుతున్నాడు.
కాపుల ఓట్లు చంద్రబాబుకి కావాలి.. కానీ కాపులు గెలవ కూడదని చంద్రబాబు అనుకుంటున్నాడు. గెలిస్తే సీట్లో ఎక్కుతాడు అని భయమా..? పవన్ అమాయకుడు. చంద్రబాబును గుడ్డిగా నమ్మేసాడు. కాపులు టీడీపీకి ఓట్లు వేయాలి. కమ్మ వారి ఓట్లు మాత్రం జనసేనకు వేయించవా..? తెలంగాణలో జనసేన గెలిస్తే ఏపీలో ఎక్కువ సీట్లు పవన్ అడుగుతాడు అని చంద్రబాబుకి భయమా..?’’ అని పోసాని ప్రశ్నించారు.