Postal Jobs 2024 : పది పాసైతే పరీక్ష లేకుండా ఉద్యోగం !

ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది ఇండియన్ పోస్టల్ డిపార్ట్ మెంట్ . దేశంలో వివిధ పోస్టల్​సర్కిళ్లలో ఖాళీగా ఉన్న 44,228 పోస్టుల భర్తీ కోసం గ్రామీణ డాక్ సేవక్​ (GDS​) నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అభ్యర్థులు గడువులోగా ఆన్​లైన్​లో అప్లయ్ చేసుకోవాలి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: July 16, 2024 | 04:07 PMLast Updated on: Jul 16, 2024 | 4:07 PM

Postal Jobs 2024

ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది ఇండియన్ పోస్టల్ డిపార్ట్ మెంట్ . దేశంలో వివిధ పోస్టల్​సర్కిళ్లలో ఖాళీగా ఉన్న 44,228 పోస్టుల భర్తీ కోసం గ్రామీణ డాక్ సేవక్​ (GDS​) నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అభ్యర్థులు గడువులోగా ఆన్​లైన్​లో అప్లయ్ చేసుకోవాలి.
ఏయే పోస్టులు అంటే
బ్రాంచ్​ పోస్ట్ మాస్టర్ (బీపీఎం)
అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్​ మాస్టర్ (ఏబీపీఎం)
డాక్​ సేవక్​

తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని పోస్టులు ?
ఆంధ్రప్రదేశ్​ – 1355 పోస్టులు
తెలంగాణ – 981 పోస్టులు

విద్యార్హతలు
India Post GDS ఉద్యోగాలకు అర్హత : పదో తరగతి ఉత్తీర్ణత

వయోపరిమితి
India Post GDS కి : వయస్సు 18 ఏళ్ల నుంచి 40 ఏళ్ల మధ్యలో ఉండాలి. OBCలకు 3 ఏళ్లు; దివ్యాంగులకు 10 ఏళ్లు; SC, STలకు 5 ఏళ్లు వయోపరిమితి సడలింపు ఉంది.

దరఖాస్తు రుసుము
India Post GDS Application Fee : అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు కింద రూ.100 చెల్లించాలి.

ఎంపిక విధానం
GDS ఎంపిక : పదో తరగతిలో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి ఉద్యోగాలనికి పిలుస్తారు.

జీతం ఎంత ?
GDS Salary :
బ్రాంచ్ పోస్ట్ మాస్టర్​కు నెలకు రూ.12 వేల నుంచి 29,380 వరకు జీతం ఉంటుంది.
అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, డాక్​ సేవక్​పోస్టులకు నెలకు రూ.10 వేల నుంచి రూ.24,470 జీతం ఇస్తారు.

దరఖాస్తు విధానం
GDS Application Process :
ఇండియా పోస్ట్ అధికారిక వెబ్​సైట్
https://indiapostgdsonline.gov.in/ద్వారా అప్లయ్ చేసుకోవాలి.

ఇందులో మీ పర్సనల్ డిటైల్స్, ఈ-మెయిల్, ఫోన్​ నంబర్లు ఎంటర్ చేయాలి. పోర్టల్​లో రిజిస్టర్ అవ్వాలి. తరువాత అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఆ తరువాత Apply Online లింక్​పై క్లిక్ చేసి, మీ డివిజన్, పోస్ట్ ప్రిఫరెన్స్​లను ఎంచుకోవాలి.
మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ తో పాటు, విద్యార్హతల వివరాలు ఎంటర్ చేయాలి.
మీ ఫొటో, సంతకంను అప్లోడ్ చేసి, అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.
తర్వాత రిఫరెన్స్ కోసం అప్లికేషన్ ప్రింటవుట్​తీసి పెట్టుకోంది.

ముఖ్యమైన తేదీలు
ఆన్​లైన్ అప్లికేషన్లు : 2024 జులై 15
ఆన్​లైన్ అప్లికేషన్లకు చివరి తేదీ : 2024 ఆగస్టు 5
అప్లికేషన్స్ ఎడిట్ : 2024 ఆగస్టు 6 నుంచి 8 వరకు