Pothina Mahesh: జనసేనకు పోతిన మహేశ్ రాజీనామా..
సోమవారం తన రాజీనామా లేఖను జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు పంపారు. పార్టీ పదవికి, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఇంతకాలం తనకు సహకరించిన జనసేన పార్టీ నాయకులకు, వీర మహిళలకు, జనసైనికులకు, పెద్దలకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు లేఖలో పేర్కొన్నారు.
Pothina Mahesh: ఎన్నికల వేళ జనసేనకు షాక్ తగిలింది. ఆ పార్టీలో కీలక నేతగా ఉన్న పోతిన మహేష్ జనసేనకు రాజీనామా చేశారు. సోమవారం తన రాజీనామా లేఖను జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు పంపారు. పార్టీ పదవికి, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఇంతకాలం తనకు సహకరించిన జనసేన పార్టీ నాయకులకు, వీర మహిళలకు, జనసైనికులకు, పెద్దలకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు లేఖలో పేర్కొన్నారు.
AP Volunteers: ఏపీ వాలంటీర్లకు లాస్ట్ వర్కింగ్ డే మే 31 ! జగన్ అందుకే మొదటి సంతకం అంటున్నారా..?
పోతిన జనసేనలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. 2019 ఎన్నికల్లో విజయవాడ వెస్ట్ అసెంబ్లీ స్థానం నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయినప్పటికీ పార్టీలోనే ఉన్నారు. విజయవాడ వెస్ట్‌లో పార్టీ కార్యక్రమాలు నిర్వహించారు. ఇక తాజా ఎన్నికల్లో జనసేన నుంచి విజయవాడ వెస్ట్ సీటు ఆశించారు పోతిన మహేష్. అయితే, ఆ సీటును పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించాల్సి వచ్చింది. అక్కడి నుంచి బీజేపీ తరఫున సుజనా చౌదరి ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారు. దీంతో విజయవాడ వెస్ట్ టిక్కెట్ ఆశించిన పోతిన మహేష్ తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. తనకు ఎలాగైనా జనసేన టిక్కెట్ ఇవ్వాల్సిందే అని పట్టుబట్టారు. తనకు టిక్కెట్ ఇస్తే కచ్చితంగా గెలిచి తీరుతానన్నారు.
అంతేకాదు.. తన అనుచరులతో కలిసి నియోజకవర్గంలో నిరసనలు, ఆందోళనలు నిర్వహించారు. అయినప్పటికీ సీటు బీజేపీకి వెళ్లింది. పైగా జనసేన అధిష్టానం నుంచి కూడా పోతిన మహేష్‌కు భవిష్యత్‌పై ఎలాంటి హామీ దక్కలేదు. పార్టీ పెద్దలు ఎవరూ పోతినను సంప్రదించలేదు. ఇంతకాలం వేచి చూసిన పోతిన.. చివరకు పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. భవిష్యత్ కార్యాచరణ త్వరలో ప్రకటిస్తానని తెలిపారు. అయితే, పోతిన స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతారా.. లేక.. మరేదైనా పార్టీలో చేరుతారా అనే ఆసక్తి నెలకొంది.