Pawan Kalyan: పవన్ కల్యాణ్‌కు అనారోగ్యం.. ఆందోళనలో ఫ్యాన్స్.. అసలు సమస్య ఏంటి ?
వారాహి యాత్రతో గోదావరి జిల్లాల్లో పవన్ దూసుకుపోతున్నారు. వైసీపీని డైరెక్ట్ టార్గెట్ చేస్తూ మాటలు సంధిస్తున్నారు. దీంతో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఇక అటు పొత్తుల వ్యవహారంలో మెలికలు పెడుతుండడంతో.. పవన్ నిర్ణయం ఏంటి.. అడుగులు ఎటు అనే చర్చ జోరుగా సాగుతోంది.

Power Star Pawan Kalyan fell ill due to a series of campaigns and film shootings
వర్షంలోనూ వెనకడుగు వేయకుండా.. వారాహి యాత్ర కంటిన్యూ చేస్తున్నారు పవన్. ఐతే ఇప్పుడు ఆయన అనారోగ్యానికి గురయ్యారు. వారాహి యాత్రలో భాగంగా రెస్ట్ లేకుండా పర్యటనలు చేస్తుండడం, దీనికి తోడు ఉపవాస దీక్ష చేస్తుండడంతో.. పవన్ ఇబ్బంది పడుతున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం పశ్చిమ గోదావారి జిల్లా పెదఅమిరంలో రెస్ట్ తీసుకుంటున్నారు.
పవన్ అనారోగ్యం కారణంగా భీమవరం నియోజకవర్గ నేతలో నిర్వహించాల్సిన సమావేశాన్ని వాయిదా వేశారు. పవన్ అనారోగ్యం వార్త తెలియగానే.. అభిమానులు ఆందోళనకు గురయ్యారు. ఐతే ఆయనకు ఇబ్బంది తక్కువగానే ఉన్నట్లు పార్టీ వర్గాలు క్లారిటీ ఇచ్చాయ్. దీంతో ఫ్యాన్స్ కుదుటపడ్డారు. పవన్ అనారోగ్యానికి గురికావడం వెనక చాలా కారణాలు కనిపిస్తున్నాయ్. వారాహియాత్రకు ముందు.. పవన్ వరుస పెట్టి షూటింగ్‌ల్లో పాల్గొన్నారు.
బ్రో, ఓజీ, హరిహరవీరమల్లు.. ఇలా వరుసగా సినిమా షూటింగ్స్ చేశారు. ఆ అలసట నుంచి బయటకు రావడానికి ముందే.. వారాహి యాత్ర మొదలైంది. దీనికితోడు ఉపవాసం, పైగా వాతావరణం కూడా ఒక్కసారిగా మారిపోవడంతో.. పవన్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఫ్యాన్స్ టెన్షన్ పడాల్సిన అవసరం లేదని.. కాస్త విశ్రాంతి తీసుకుంటే అంతా సెట్ అవుతుందని.. పవన్ మళ్లీ యాత్ర మొదలుపెడతారని జనసేన వర్గాలు చెప్తున్నాయ్.