Pawan Kalyan: 470 కేజీల వెండితో పవన్ కళ్యాణ్ ఫొటో
పవన్ కళ్యాణ్ అభిమానులకు ఆయన అంటే విపరీతమైన క్రేజ్ ఉందని మరోసారి రుజువైంది.

Pawan Kalyan Photo With 470 KG Silver Chains
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు ఫ్యాన్స్ ఉండరు అంతా భక్తులే. ఎందుకు అంత అభిమానం అంటే చెప్పలేరు కానీ ఎంత అంటే మాత్రం చెప్తారు. అది పవన్ ఫ్యాన్స్ అంటే. ప్రతీ సంవత్సరం పవన్ కళ్యాణ్ బర్త్ డే వచ్చిందంటే చాలు ఫ్యాన్స్ చేసే హంగామా అంతా ఇంతా కాదు. అదేదో పెద్ద పండగలా చేస్తుంటారు. అయితే పవర్ స్టార్ రాజకీయాల్లోకి వచ్చిన తరువాత ఆయన ఫ్యాన్స్ అంతా జనసైనికులు ఐపోయారు. ప్రతీ సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా పవన్ కళ్యాణ్‌కు గుర్తుండిపోయే గిఫ్ట్ ఇచ్చారు జనసైనికులు. ఏకంగా 470 కేజీల వెండి గొలుసులతో పవన్ కళ్యాణ్ చిత్రపటాన్ని రూపొందించారు.
జనసేన పార్టీ నెల్లూరు టౌన్ అధ్యక్షుడు దుగ్గిశెట్టి సుజయ్ బాబు ఆధ్వర్యంలో ఈ కళాకృతిని తయారు చేయించారు. ఇందుకు సంబంధించిన మేకింగ్ వీడియోను జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ రిలీజ్ చేశారు. 15 గంటలు శ్రమించి మొదట పవన్ కళ్యాణ్ చిత్రాన్ని గీశారు. ఆ లైన్స్‌ను వెండి గొలుసులతో ఫిల్ చేశారు. ఈ ఫొటోను గొలుసులతో నింపేందుకు 470 కేజీల వెండిని వాడినట్టు జనసైనికులు చెప్తున్నారు. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ అంటే ఆయన అభిమానులకు ఉన్న అభిమానం చూస్తుంటే యాంటీ ఫ్యాన్స్ కూడా శభాష్ అంటున్నారు.