Prabhas : ప్రభాస్….రోజుకి కోటి రూపాయలా..

ప్రభాస్‌తో (Prabhas) సినిమా అంటే మామూలు విషయం కాదు. డబ్బులు నీళ్లలా ఖర్చు పెట్టాల్సిందే. అందుకు తగ్గట్టే ప్రభాస్ మార్కెట్ కూడా ఉంది. అయితే రాజసాబ్ విషయంలో ఇలా జరగడం లేదనుకున్నారు. కానీ రోజుకి కోటి ఖర్చు చేస్తున్నారట.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 26, 2024 | 10:02 AMLast Updated on: Mar 26, 2024 | 10:02 AM

Prabhas A Crore Per Day

 

 

 

ప్రభాస్‌తో (Prabhas) సినిమా అంటే మామూలు విషయం కాదు. డబ్బులు నీళ్లలా ఖర్చు పెట్టాల్సిందే. అందుకు తగ్గట్టే ప్రభాస్ మార్కెట్ కూడా ఉంది. అయితే రాజసాబ్ విషయంలో ఇలా జరగడం లేదనుకున్నారు. కానీ రోజుకి కోటి ఖర్చు చేస్తున్నారట.

బాహుబలి (Baahubali) తర్వాత పాన్ ఇండియా స్టార్ (Pan India Star) ప్రభాస్ నటిస్తున్న సినిమాల బడ్జెట్ అన్నీ వందల కోట్లలోనే ఉంటున్నాయి. సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్, సలార్ సినిమాలన్నీ కూడా భారీ బడ్జెట్‌తో తెరకెక్కాయి. ఇప్పుడు రిలీజ్‌కు రెడీగా ఉన్న కల్కి 2898 ఏడి కూడా 500 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో రాబోతోంది.

ఇక సందీప్ రెడ్డి వంగ ‘స్పిరిట్’ (Spirit) కూడా ఇంచుమించు ఇదే బడ్జెట్‌తో రాబోతోంది. అయితే మారుతి తెరకెక్కిస్తున్న రాజా సాబ్ సినిమా బడ్జెట్ మాత్రం కాస్త తక్కువగా ఉంటుందని అనుకున్నారు. కానీ ఈ సినిమాకు కూడా గట్టిగానే ఖర్చు చేస్తున్నారట మేకర్స్. ఈ సినిమా విజువల్ వండర్‌గా ఉంటుందని చెబుతున్నారు. ఈ లెక్కన గ్రాఫిక్స్ వర్క్ కోసం బాగానే అయ్యే ఛాన్స్ ఉంది. దాదాపు 300 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు.

దీంతో.. లేటెస్ట్ న్యూస్ ఒకటి వైరల్‌గా మారింది. రాజాసాబ్ 4 రోజుల షూటింగ్ కోసం దాదాపు 4 కోట్ల బడ్జెట్‌ ఖర్చు చేసినట్టుగా తెలుస్తోంది. అంటే రోజుకు కోటి అన్నమాట. ఒక‌వేళ ప్రభాస్ సినిమా కాకపోయి ఉంటే.. ఈ బడ్జెట్‌లో రెండు మూడు చిత్రాలు తెర‌కెక్కించేవాడిని, ఒక్క రోజు బ‌డ్జెట్‌తో ఒక‌ సినిమా పూర్తి చేసేసేవాడిని.. అని మారుతి చెప్పుకొచ్చాడు. కెరీర్ స్టార్టింగ్ నుంచి కూడా తక్కువ బడ్జెట్‌లోనే సినిమాలు చేస్తు వచ్చాడు మారుతి. త‌న డెబ్యూ సినిమా ‘ఈరోజుల్లో’ కేవ‌లం 30 ల‌క్ష‌ల బ‌డ్జెట్‌లో పూర్తి చేసినట్టు టాక్. కానీ ప్ర‌భాస్ లాంటి హీరోతో సినిమా అంటే.. కోట్లు కుమ్మరించాల్సిందే. అందుకే.. మారుతి ఈ మాట అన్నాడు. మరి రాజాసాబ్ ఎలా ఉంటుందో చూడాలి