Venu Swamy : వేణు స్వామిని ఏకిపారేస్తున్న ప్రభాస్‌ ఫ్యాన్స్‌..

టాలీవుడ్‌ ఆడియన్స్‌కు వేణుస్వామి పరిచయం అవసరం లేని వ్యక్తి. సెలెబ్రెటీల జాతకం చెప్తూ సోషల్‌ మీడియాలో మంచి ఫేమ్ క్రియేట్‌ చేసుకున్నాడు వేణుస్వామి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 22, 2023 | 02:22 PMLast Updated on: Dec 22, 2023 | 2:22 PM

Prabhas Fans Celebrating Venu Swamy

టాలీవుడ్‌ ఆడియన్స్‌కు వేణుస్వామి పరిచయం అవసరం లేని వ్యక్తి. సెలెబ్రెటీల జాతకం చెప్తూ సోషల్‌ మీడియాలో మంచి ఫేమ్ క్రియేట్‌ చేసుకున్నాడు వేణుస్వామి. చాలా సందర్భాల్లో ఆయన చెప్పినవి చెప్పినట్టే జరగడంతో చాలా మంది ఆయనను నమ్మడం మొదలుపెట్టారు. ఏ సెలబ్రెటీ ఇంట్లో పూజ జరిగినా అక్కడ వేణుస్వామి ఉండాల్సిందే. సినిమా ఓపెనింగ్‌లు మొదలు హీరో హీరోయిన్ల గృహప్రవేశాల వరకూ.. వేణుస్వామి చేయని కార్యక్రమాలు లేవు. దీంతో కొన్ని రోజుల నుంచి నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు వేణుస్వామి. అలాంటి వ్యక్తిని ఇప్పుడు ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఓ రేంజ్‌లో ఆడుకుంటున్నారు.

మాస్‌ మీమ్స్‌ తయారు చేసి సోషల్‌ మీడియాలో ఏకిపారేస్తున్నారు. దీనికి కారణం.. అప్పట్లో ప్రభాస్‌ గురించి వేణుస్వామి చెప్పిన జాతకం. అందరి జాతకాలు చెప్పే వేణస్వామి.. అదే క్రమంలో ప్రభాస్‌ జాతకం కూడా ఓ సారి చెప్పాడు. పెళ్లి, సినిమాల హిట్‌ విషయంలో సంచలన కామెంట్స్‌ చేశాడు. ప్రభాస్‌ జాతకం ప్రకారం ఇక అతనికి హిట్స్‌ వచ్చే అవకాశమే లేదని చెప్పాడు వేణుస్వామి. రాధేశ్యామ్‌, ఆదిపురుష్‌ కూడా ఈ కారణంగానే ఫ్లాప్‌ అయ్యాయంటూ చెప్పాడు. ఇప్పుడు వచ్చిన సలార్‌ సినిమా కూడా ఫ్లాప్‌ అవుతుందని.. ప్రభాస్‌కు తన కెరీర్‌లో ఇక పెద్ద హిట్‌ రావడమే కష్టమే అంటూ తేల్చేశాడు. అప్పటికే వేణుస్వామి చెప్పిన చాలా విషయాలు నిజమవ్వడంతో.. ప్రభాస్‌ ఫ్యాన్స్‌ అంతా తెగ టెన్షన్‌ పడిపోయారు.

అయ్యో మా డార్లింగ్‌కు ఇక హిట్స్‌ ఉండవా అంటూ ఏడ్చినంత పని చేశారు. కానీ ఇప్పుడు రిలీజైన సలార్‌ సినిమా.. వేణుస్వామి జోతిష్యాన్నే కాదు.. సినీ ఇండస్ట్రీ రికార్డ్స్‌ను కూడా తలకిందులు చేసింది. పెద్ద హిట్‌ కాదు.. బాక్సాఫీస్‌ బద్దలయ్యే హిట్‌గా నిలిచింది. దీంతో వేణుస్వామిని టార్గెట్‌ చేశారు ప్రభాస్‌ ఫ్యాన్స్‌. ఏం మాట్లాడారు గురువుగారూ అంటూ మర్యాదగా వేసుకోవడం ప్రారంభించారు. వింత వింత మీమ్స్‌ క్రియేట్‌ చేసి సోషల్‌ మీడియాలో వేణుస్వామిని ఏకిపారేస్తున్నారు. పరిస్థితులు ఎప్పుడు ఎలా మారుతాయో తెలియదు. అలాంటప్పుడు చేసే ప్రతీ పనీ.. మాట్లాడే ప్రతీ మాట ఆచి తూచి మాట్లాడాలి అని వేణుస్వామికి సెటైరికల్‌గా సలహా ఇస్తున్నారు నెటిజన్లు.