Prabhas sister : కల్కిలో ప్రభాస్ చెల్లిదే కీ రోల్‌.. మాములు టాలెంటెడ్‌ కాదు భయ్యో..

ఇప్పుడు ఏ నలుగురు కలిసినా కల్కి మూవీ గురించే డిస్కషన్‌. మహాభారతానికి ఫిక్షన్ యాడ్ చేసి నాగి చేసి వండర్‌కు ప్రతీ ఒక్కరు ఫిదా అవుతున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: June 29, 2024 | 04:47 PMLast Updated on: Jun 29, 2024 | 4:47 PM

Prabhas Played The Key Role In Kalki

ఇప్పుడు ఏ నలుగురు కలిసినా కల్కి మూవీ గురించే డిస్కషన్‌. మహాభారతానికి ఫిక్షన్ యాడ్ చేసి నాగి చేసి వండర్‌కు ప్రతీ ఒక్కరు ఫిదా అవుతున్నారు. డార్లింగ్ స్టైల్‌ అయితే నెక్ట్స్ లెవల్ అంతే ! వింటేజ్‌ ప్రభాస్ ఈజ్‌ బ్యాక్ అంటూ మురిసిపోతున్నారు అంతా ! ఇక పార్ట్‌ 2 మీద మరింత క్యూరియాసిటీ పెరగడంతో.. రిలీజ్ కోసం ఫ్యాన్స్‌ ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు. ఐతే మూవీకి సంబంధించి ఇప్పుడు ఇంట్రస్టింగ్ విషయం ఒకటి బయటకు వచ్చింది.

కల్కిలో ప్రభాస్‌ చెల్లి కూడా ఉంది. ఐతే కనిపించింది స్క్రీన్‌ మీద కాదు.. ఆఫ్ ది కెమెరా కష్టపడింది. ప్రభాస్ చెల్లి ప్రకీర్తి.. కల్కికి ప్రొడక్షన్ డిజైనర్‌గా పనిచేసింది. స్టోరీని విజువలైజ్ చేయడంలో.. ఆ విజువల్స్‌ రిచ్‌గా ఉండడంలో.. ప్రొడక్షన్ డిజైనర్‌దే కీ రోల్. కల్కిలో అలాంటి విజువల్స్‌ చాలా ఉన్నాయ్‌. కొత్త లోకానికి తీసుకెళ్తాయ్. వీటన్నింటిని వెనక ప్రొడక్షన్ డిజైనర్‌గా ప్రకీర్తి కీ రోల్‌ ప్లే చేసింది. దీంతో ప్రభాస్‌ ఫ్యామిలీ ఆనందంలో మునిగితేలుతోంది. ప్రకీర్తితో ఉన్న ఫొటోను షేర్ చేసిన కృష్ణంరాజు భార్య శ్యామల.. నీ కష్టానికి ఫలితం లభించింది లవ్ యూ పోస్ట్ చేశారు.

కృష్ణంరాజు రెండో కూతురే ఈ ప్రకీర్తి. పెదనాన్న కూతుళ్లు అయినా.. సొంత చెల్లెళ్లలానే చూసుకుంటాడు ప్రభాస్‌. చెల్లెళ్లంటే ప్రభాస్‌కు వల్లమాలిన ప్రేమ. చెల్లెళ్ల కెరీర్‌ సెట్‌ చేసేందుకు ప్రభాస్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. పెద్ద చెల్లి ప్రసీదను ఇప్పటికే రాధేశ్యామ్‌ మూవీతో ప్రొడ్యూసర్‌గా పరిచయం చేశాడు. ఇప్పుడు ప్రకీర్తిని కల్కి ప్రాజెక్ట్‌లో ఇన్వాల్వ్ చేశాడు. ఐతే అన్న తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని ప్రకీర్తి వంద శాతం నెరవేర్చింది. కల్కి సక్సెస్ రూపంలో అది కనిపిస్సతోంది. కృష్ణంరాజుకు ముగ్గురు కూతుళ్లు. ప్రసీద, ప్రకీర్తి, ప్రదీప్తి. వీళ్లంటే ప్రభాస్‌కు చాలా ఇష్టం. ఎంత బిజీ షెడ్యూల్‌లో ఉన్నా.. ఈ ముగ్గురి కోసం టైమ్ ఇస్తాడు ప్రబాస్.