Prabhas: నో సర్ ప్రైజ్.. ఓన్లీ కటౌట్
సలార్ మూవీ టీం కేవలం ప్రభాస్ ఫ్యాన్స్ సహనాన్ని పరీక్షిస్తోంది. అప్పడెప్పుడో రావాల్సిన టీజర్ ని మొన్నీమధ్య వదిలారు. బర్త్ డే కి అనుకున్న ట్రైలర్ విషయంలో ఎనౌన్స్ మెంట్ లేకేండా, భారీ కటౌట్ తో సరిపెట్టారు.

Prabhas Salar made up for it with a huge cutout without any suspense announcement regarding the movie.
సలార్ మూవీ టీం కేవలం ప్రభాస్ ఫ్యాన్స్ సహనాన్ని పరీక్షిస్తోంది. అప్పడెప్పుడో రావాల్సిన టీజర్ ని మొన్నీమధ్య వదిలారు. బర్త్ డే కి అనుకున్న ట్రైలర్ విషయంలో ఎనౌన్స్ మెంట్ లేకేండా, భారీ కటౌట్ తో సరిపెట్టారు. ఇప్పుడు సినిమా ప్రమోషన్ మీద ఉలుకూలేదు. పలుకూలేదు. ఏదో రెబల్ స్టార్ బర్త్ డే కాబట్టి నిర్మాతల హడావిడి తప్ప దర్శకుడు ప్రశాంత్ నీల్ చేసిందేంలేదు
అసలే బాహుబలి తర్వాత సింగిల్ హిట్ లేక ప్రభాస్ ఇంకా ఫైట్ చేస్తూనే ఉన్నాడు. సాహో యావరేజ్ గా ఆడితే, రాధేశ్యామ్, ఆదిపురుష్ డిజాస్టర్లయ్యాయి. దీంతో ఇంకెప్పుుడు బాహుబలి రేంజ్ బ్లాక్ బస్టర్ అనుకుంటున్నతనకి, సలార్ ఓ మంచి ఆప్షన్ లా కనిపించింది. కాని ఈ సినిమా విషయంలో మొదట్నుంచి అన్నీ డిలే అవటం, క్లైమాక్స్ గ్రాఫిక్స్ బాలేక ప్యాచ్ వర్క్ జరగటంతో, ఆదిపురుష్ తాలూకు భయాలే పెరిగాయి
ఇలాంటి టైంలో ప్రభాస్ బర్త్ డే కి కూడా చెప్పుకోదగ్గ సర్ ప్రైజ్ లేకపోవటం ఫ్యాన్స్ నిరాశే కలిగిస్తోంది. అన్నీంటికి మించి దర్శకుడు ప్రశాంత్ నీల్ సైలెన్స్ సినిమా మీద డౌట్లను పెంచేస్తోంది.. సరే కేజీయఫ్ 2 విషయంలో కూడా ఇలానే తన పద్దతి ఉంది కాబట్టి, సైలెంట్ గా సలార్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేస్తున్నాడనుకుందామంటే, ఓవైపు ప్రభాస్ నీ సర్జరీ అవటం, తను రెండు నెలల వరకు కాస్త రెస్ట్ తీసుకోవాల్సి రావటం.. ఇలాంటి టైంలో తన బర్త్ డే, ఇవన్నీ ఉండటంతో, ఫ్యాన్స్ ఏం ఎక్స్ పెక్ట్ చేయాలో తేలియట్లేదు. కనీసం సలార్ టీం అయినా అప్ డేట్స్ తో ఫ్యాన్స్ లో సంతోషాన్ని నింపిందా, ప్రమోషన్ లో ఎమోషన్ పెరిగిందా అంటే అదీ లేదు.