Praja Bhavan: భట్టి విక్రమార్క అధికారిక నివాసంగా ప్రజా భవన్
ప్రజా భవన్‌ను డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్కకు కేటాయిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రజా భవన్‌ను భట్టి ప్రైవేటు సెక్యూరిటీకి అప్పగించాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశాలు జారీ చేశారు.

Praja Bhavan: ప్రజా భవన్ వినియోగం విషయంలో కొనసాగుతున్న సందిగ్ధతకు తెరపడింది. ప్రజా భవన్‌ను తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారిక నివాసంగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో సీఎం అధికారిక నివాసంగా కొనసాగిన ప్రగతి భవన్‌ను సీఎం రేవంత్.. జ్యోతిబాపూలే ప్రజా భవన్‌గా మార్చారు. ఇక్కడ ప్రజా వాణి (ప్రజా దర్బార్) కూడా నిర్వహిస్తున్నారు. అయితే, కేసీఆర్‌లాగా ఇక్కడ ఉండేందుకు రేవంత్ రెడ్డి ఆసక్తి చూపడం లేదు.
Parliament attack: పార్లమెంటుపై దాడి.. నలుగురు అరెస్టు..
రేవంత్ తన అధికారిక నివాసాన్ని మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి ప్రాంగణంలోకి మార్చాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు ప్రజా భవన్‌ను ఏం చేస్తారు అనే సందేహాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో ప్రజా భవన్‌ను డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్కకు కేటాయిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రజా భవన్‌ను భట్టి ప్రైవేటు సెక్యూరిటీకి అప్పగించాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశాలు జారీ చేశారు.
త్వరలోనే భట్టి విక్రమార్క ప్రజా భవన్‌కు మారనున్నారు. అయితే, ఇంతకుముుందులాగే ప్రజా భవన్‌లో ప్రజా వాణి కొనసాగిస్తారా.. లేదా.. అన్నది చూడాలి. సీఎం రేవంత్ కూడా అధికారిక నివాసాన్ని ఏర్పాటు చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనిపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.