Praneet Hanuman : గబ్బుగాడిపై గంజాయి కేసు.. ఈ టిమటిమలు కూడా ఉన్నాయేంట్రా..
ప్రణీత్ హనుమంతు.. తండ్రీకూతుళ్ల బంధంలోనూ బూతులు వెతికిన దగుల్బాజీ. ఓ ముగ్గురితో కలిసి ముచ్చట్లు అంటూ స్టార్ట్ చేసి.. ముదనాష్టపు ట్రోలింగ్ చేసి.. బంధాలకు బూతు అంటగట్టాడీ దరిద్రుడు.

Praneet Hanuman.. Dagulbaji who searched for the bond between father and daughter. He started with three people saying "Muchattu".
ప్రణీత్ హనుమంతు.. తండ్రీకూతుళ్ల బంధంలోనూ బూతులు వెతికిన దగుల్బాజీ. ఓ ముగ్గురితో కలిసి ముచ్చట్లు అంటూ స్టార్ట్ చేసి.. ముదనాష్టపు ట్రోలింగ్ చేసి.. బంధాలకు బూతు అంటగట్టాడీ దరిద్రుడు. ప్రణీత్ బాగోతం సీఎం వరకు వెళ్లగా.. పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చెంచల్‌గూడ జైల్లో ఇప్పుడు ప్రణీత్ ఊచలు లెక్కిస్తున్నాడు. తండ్రి, కూతుర్ల రిలేషన్‌పై అభ్యంతరకర కామెంట్స్ చేసిన హనుమంతుపై… ఇప్పుడు మరో కేసు నమోదయింది.
ప్రణీత్ గంజాయి సేవించినట్టు మెడికల్ రిపోర్ట్ వచ్చింది. దీంతో అతనిపై NDPS యాక్ట్ కింద కేసు పెట్టారు పోలీసులు. ప్రణీత్‌ను మూడు రోజుల కస్టడీ కోరుతూ.. పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఈమేరకు ప్రణీత్ న్యాయవాదికి నోటీసులు జారీ చేసింది కోర్టు. ప్రణీత్‌ది వెల్ ఎడ్యుకేటెడ్ బ్యాక్‌గ్రౌండ్. వాళ్ల నాన్న ఐఏఎస్ ఆఫీసర్ కూడా ! ఈ ప్రబుద్ధుడికి మాత్రం బుద్ది అటకెక్కింది. నీచమైన పనులు చేస్తూ.. మరింత చీప్ అవుతున్నాడంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. నోటి దూలే అనుకున్నాం.. గంజాయి కూడానా.. ఈ టిమటిమలు కూడా ఉన్నాయేంట్రా అంటూ.. కామెంట్లు పెడుతున్నారు.
డార్క్ కామెడీ పేరుతో సోషల్ మీడియాలో విచ్చలవిడిగా పిచ్చి పిచ్చి కామెంట్స్ చేసిన హనుమంతుపై.. సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయ్. హద్దు దాటానని.. క్షమాపణలు కోరుతూ ఓ వీడియోను కూడా వదిలాడు ప్రణీత్. కొన్నిరోజులుగా తన తల్లిదండ్రులను బూతులు తిడుతున్నారని.. వారిని దయచేసి వారిని ఏమి అనొద్దని తప్పంతా తనదే అన్నాడు. ఈ విషయంలో చట్టానికి గౌరవిస్తూ ముందుకు సాగుతానని.. మరోసారి ఇలాంటి పొరపాట్లు చేయనని చెప్పుకొచ్చాడు. తప్పు చేసి క్షమించమని అడిగినా.. అతనిపై జనాలు మండిపడుతూనే ఉన్నారు. సోషల్ మీడియాలో ఇలాంటి పిచ్చి వాగుడు వాగేవారికి బుద్దొచ్చేలా శిక్షించాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.