KCR: కేసీఆర్ మీద పోలీస్ కంప్లైంట్.. ప్రణీత్ రావు వెనక ఉంది ఆయనేనా..?
సీఎం ఆదేశాలతో అధికారులు తీగ లాగడంతో ఈ వ్యవహారం డొంకంతా కదిలింది. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో డీఎస్పీ ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు అధికారులు నిర్ధారించారు. దీంతో ప్రణీత్ రావును సస్పెండ్ చేశారు.
KCR: తెలంగాణ రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం లేపిన రాజకీయ ప్రకంపణలు అన్నీ ఇన్నీ కావు. ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ల సంభాషణలన్నీ కేసీఆర్ వింటున్నాడంటూ అప్పటి ప్రతిపక్ష ఇప్పటి అధికార పక్ష కాంగ్రెస్ నేతలు చాలా ఆరోపణలు చేశారు. కానీ అప్పుడు ఆ ఆరోపణలకు ఆధారాలు లేవు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయంపై ఫోకస్ చేశారు. సీఎం ఆదేశాలతో అధికారులు తీగ లాగడంతో ఈ వ్యవహారం డొంకంతా కదిలింది.
YCP-JANASENA: జనసేనతో పొత్తుకు వైసీపీ ప్రయత్నం.. ప్రశాంత్ కిషోర్ సంచలన వీడియో
స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో డీఎస్పీ ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు అధికారులు నిర్ధారించారు. దీంతో ప్రణీత్ రావును సస్పెండ్ చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంలో అధికారంలోకి రాబోతోంది అని తెలియగానే ఎస్‌ఓటీ రూంలో ఉన్న హార్డ్ డిస్క్‌కు కొన్ని సాఫ్ట్ ఫైల్స్ ప్రణీత్ రావు ధ్వసం చేశాడని నిర్ధారించారు. కానీ ఆ ఫైల్స్‌లో ఏముంది అనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్. అయితే ప్రణీత్ రావుతో ఈ వ్యవహారం మొత్తం కేసీఆర్ చేయించాడంటూ అరుణ్ కుమార్ అనే లాయర్ పోలీస్ కంప్లైట్ ఇచ్చారు. పంజాగుట్టా పీఎస్‌లో కేసీఆర్ మీద ఫిర్యాదు చేశారు. సీఎంకు తెలియకుండా ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఏం జరిగే అవకాశం లేదని.. కాబట్టి ఈ కేసులో కేసీఆర్‌ను వెంటనే అదుపులోకి తీసుకుని విచారించాలంటూ కేసు పెట్టారు. ఈ కేసులో కేసీఆర్‌ను ఏ1గా చేర్చాలంటూ డిమాండ్ చేశారు. చాలా కాలంగా కాంగ్రెస్ నేతలు కూడా బీఆర్‌ఎస్ గురించి ఇదే ఆరోపణ చేస్తున్నారు.
బీఆర్‌ఎస్ పెద్దలే ఈ వ్యవహారం మొత్తం నడిపించారంటూ చెప్తున్నారు. దీంతో ఇప్పుడు నెక్స్ట్ ఏం జరగబోంతోంది అనేది సస్పెన్స్‌గా మారింది. ఇప్పటికే ప్రణీత్ రావు పోలీసులు అదుపులోనే ఉన్నాడు. ఇప్పుడు నిజంగానే కేసీఆర్‌కు కూడా ఈ వ్యవహారంలో లింకులు ఉన్నాయని ఆధారాలు దొరికితే కేసీఆర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకునే ఛాన్స్ కూడా ఉంది. అదే జరిగితే తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు చెలరేగడం గ్యారెంటీ.