Pre-wedding shoot : ఆపరేషన్ థియేటర్లో ప్రీ వెడ్డింగ్ షూట్.. మీ దుంపల్ తెగ
పెళ్లి చేసుకోవడంలోనూ ట్రెండ్ ఫాలో అవుతోంది నేటి యూత్. ఒకప్పుడు సంగీత్ (Sangeet), రిసెప్షన్ గ్రాండ్‌గా ప్లాన్ చేసేవాళ్లు. ఇప్పుడు వాటికి యాడ్ అన్నట్లు.. ప్రీ వెడ్డింగ్ షూట్ (Pre Wedding Shoot) కల్చర్ వచ్చి చేరింది.

Pre-wedding shoot in operation theatre..
పెళ్లి చేసుకోవడంలోనూ ట్రెండ్ ఫాలో అవుతోంది నేటి యూత్. ఒకప్పుడు సంగీత్ (Sangeet), రిసెప్షన్ గ్రాండ్‌గా ప్లాన్ చేసేవాళ్లు. ఇప్పుడు వాటికి యాడ్ అన్నట్లు.. ప్రీ వెడ్డింగ్ షూట్ (Pre Wedding Shoot) కల్చర్ వచ్చి చేరింది. ఈ షూట్ కోసం కొత్త దంపతులు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. తమ ప్రేమ కథను, పెళ్లి కథను.. ప్రీ వెడ్డింగ్ షూట్ ద్వారా చెప్పాలనుకుంటున్నారు. ఇందులో తప్పేం లేదు. ఐతే హద్దులు దాటితేనే తప్పు. కర్ణాటకలో ఓ జంట చేసిన పని ఇప్పుడు.. సోషల్ మీడియా (Social Media) లో వైరల్ అవుతోంది.
ఒక డాక్టర్ తనకు కాబోయే భార్యతో కలిసి ఆపరేషన్ థియేటర్లో ప్రీ వెడ్డింగ్ షూట్ చేశాడు. వింటేనే ఆశ్చర్యం అనిపిస్తోంది కదా.. ఇదే నిజం మరి ! కర్ణాటక చిత్రదుర్గ జిల్లా భర్మసాగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ ఘటన జరిగింది. ఈ ఆస్పత్రిలో అభిషేక్ కాంట్రాక్ట్ డాక్టర్‌గా పనిచేస్తున్నాడు. ఈ మధ్యే అతనికి పెళ్లి కుదిరింది. ఐతే క్రియేటివ్‌గా ఉండాలని.. తనకు కాబోయే భార్యతో కలిసి ప్రభుత్వ ఆసుపత్రి ఆపరేషన్ థియేటర్లో అభిషేక్ ప్రీ వెడ్డింగ్ షూట్ నిర్వహించాడు. ఈ షూట్లో భాగంగా ఓ వ్యక్తికి సర్జరీ చేస్తున్నట్టు అభిషేక్ యాక్ట్ చేశాడు. కాబోయే భార్య అతనికి సహకరిస్తున్నట్టు.. అతడి మొదటిపై పట్టిన చెమటను దూదితో తుడుస్తున్నట్టు నటించింది. ఐతే ఈ వ్యవహారం మొత్తాన్ని చూసిన సర్జరీలో పాల్గొన్న రోగి… ఒక్కసారిగా పైకి లేస్తాడు. ఒక నవ్వు నవ్వి తిరిగి పడుకుంటాడు.
దీంతో డాక్టర్ అభిషేక్ (Dr. Abhishek), అతడికి కాబోయే భార్య, ఆపరేషన్ థియేటర్లో (Operation Theater) ఉన్న లైటింగ్ ఫోటో, వీడియో షూటింగ్ సిబ్బంది ఒక నవ్వు నవ్వి ఊరుకుంటారు. అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో సర్కులేట్ కావడంతో ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. డాక్టర్ అభిషేక్‌ను సస్పెండ్ చేసింది. ఈ వీడియోను షేర్ చేస్తున్న నెటిజన్లు.. ఆ జంట మీద ఫైర్ అవుతున్నారు. బాగానే ఎక్స్‌ట్రాలు చేశారుగా అని ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు. ప్రీ వెడ్డింగ్ షూట్ తప్పేం లేదు కానీ.. మరీ ఇలా తయారయ్యారేంటి అంటూ ఫైర్ అవుతున్నారు.