తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న ప్రధాని మోదీ..
నిన్నటి వరకు తెలంగాణ ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ.. ఇవాళ ఉదయం కలయుగిక దైవం.. తిరుమల శ్రీవారి సన్నిదిలో.. శ్రీవేంకటేశ్వర స్వామి వారిని ప్రధాని నరేంద్ర మోదీ దర్శించుకున్నారు. ఆలయ మహాద్వారం దగ్గర ప్రధానికి టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి, ఈవో ధర్మారెడ్డి స్వాగతం పలికారు. అనంతరం శ్రీవారి సేవలో పాల్గొన్నారు. శ్రీవారి దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో ఆయనకు అర్చకులు వేదాశీర్వచనం ఇచ్చారు.

Prime Minister Modi visited Lord Shiva in Tirumala.
నిన్నటి వరకు తెలంగాణ ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ.. ఇవాళ ఉదయం కలయుగిక దైవం.. తిరుమల శ్రీవారి సన్నిదిలో.. శ్రీవేంకటేశ్వర స్వామి వారిని ప్రధాని నరేంద్ర మోదీ దర్శించుకున్నారు. ఆలయ మహాద్వారం దగ్గర ప్రధానికి టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి, ఈవో ధర్మారెడ్డి స్వాగతం పలికారు. అనంతరం శ్రీవారి సేవలో పాల్గొన్నారు.
శ్రీవారి దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో ఆయనకు అర్చకులు వేదాశీర్వచనం ఇచ్చారు.
Congress Party : కాంగ్రెస్ కు ఖమ్మం జిల్లాలో 10కి 10ది సీట్లు కష్టమే.. ?
ప్రధానికి టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ధర్మారెడ్డి.. స్వామి వారి చిత్రపటాన్ని, తీర్థ ప్రసాదాలను అందించి స్వామివారి శేషవస్త్రంతో నరేద్ర మోదీని సత్కరించారు. ప్రధాని.. సుమారు 50 నిమిషాల పాటు ఆలయంలో గడిపారు. ప్రధాని హోదాలో నరేంద్ర మోదీ తిరుమలకు రావడం ఇది నాలుగోసారి. ప్రధాని తిరుమల నుంచి బయల్దేరి తెలంగాణకు రానున్నారు.. ఇవాళ తిరిగి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ప్రధానికి పర్యటన సందర్భంగా తిరుమలలో ఆంక్షలు విధించారు. ప్రధాని వెళ్లే మార్గంలో ఉన్న దుకాణాలు మూసివేశారు. వాహన రాకపోకలు నిషేధించారు. ప్రధాని పర్యటనకు మీడియాని కూడా అనుమతించలేదు. ప్రధాని మోదీ శ్రీవారి దర్శనం అనంతరం.. రచన అతిథి గృహానికి చేరుకున్నారు. కాసేపు అక్కడే విశ్రాంతి తీసుకుంటారు. తర్వాత అక్కడి నుంచి తిరుగు ప్రయాణం అవుతారు.
ఆదివారం రాత్రి తిరుపతి జిల్లా రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న ప్రధానికి ఘన స్వాగతం లభించింది. ఆయనకు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం వైఎస్ జగన్ పుష్పగుచ్ఛాలు అందించి, శాలువాలతో ఘనంగా సత్కరించి సాదర స్వాగతం పలికారు.