Narendra Modi, Russia : జులైలో ప్రధాని మోదీ రష్యా పర్యటన.. ఉక్రెయిన్ – రష్యా యుద్ధంపై చర్చలు
భారత ప్రధాని నరేంద్ర మోదీ జూలై లో రష్యాలో పర్యటించనున్నారు. భారత్-రష్యాల మధ్య వార్షిక చర్చల కోసం భారత్ స్వతంత్ర వైఖరిని ప్రదర్శిస్తోంది. దీంతో ప్రధాని ఈ పర్యటనకు వెళ్లనున్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని శాంతియుతంగా పరిష్కరించేందుకు ప్రధాని ప్రయత్నిస్తారని తెలుస్తోంది.

Prime Minister Modi's visit to Russia in July... Discussions on Ukraine-Russia war
భారత ప్రధాని నరేంద్ర మోదీ జూలై లో రష్యాలో పర్యటించనున్నారు. భారత్-రష్యాల మధ్య వార్షిక చర్చల కోసం భారత్ స్వతంత్ర వైఖరిని ప్రదర్శిస్తోంది. దీంతో ప్రధాని ఈ పర్యటనకు వెళ్లనున్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని శాంతియుతంగా పరిష్కరించేందుకు ప్రధాని ప్రయత్నిస్తారని తెలుస్తోంది. మరోవైపు ఈ ఏడాది కచన్ నగరంలో జరిగే బ్రిక్స్ సమావేశాల్లో మోదీ, పుతిన్ కలుసుకోనున్నట్లు సమాచారం. మరోవైపు 2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై రష్యా యుద్దం మొదలైన నాటి నుంచి నేటి వరకు ప్రధాని నరేంద్ర మోదీ రష్యాలో పర్యటించడం ఇదే పర్యటన.
రష్యా పుతిన్ అధ్యక్ష కార్యాలయం క్రెమ్లిన్ వర్గాలను రష్యా అధికారిక మీడియా సంస్థ.. మోడీ పర్యటన విషయంలో రష్యా నుంచి బహిరంగ ఆహ్వానం ఉందని, పుతిన్‌తో ఆయన సమావేశం ఉంటుందని మార్చినెలలో క్రెమ్లిన్ వెల్లడించింది.
- ఉక్రెయిన్ – రష్యా యుద్దం ఆపే శక్తి భారత్ కే ఉంది – ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ
ప్రధాని నరేంద్ర మోదీ మూడోసారి భారత ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత G7 Summit లో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాల అధినేతలతో సమావేశం అయ్యారు. అక్కడే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో భేటీ అయ్యారు. కాగా ఈ భేటిలో ఉక్రెయిన్-రష్యా యుద్ధం గురించి కొంత సేపు ముచ్చటించారు. కాగా ఎప్పటి నుంచో భారత్ రెండు దేశాల మధ్య స్వతంత్రగంగానే తన వైఖరిని వినిపిస్తు ఉంది. చర్చలు, దౌత్యమార్గాల ద్వారానే ఇరు దేశాల మధ్య తలెత్తిన సమస్యలు పరిష్కరించుకోవాలని పలుమార్లు ఉక్రెయిన్-రష్యా సూచించాయి. పశ్చిమ దేశాల నుంచి వచ్చిన ఒత్తిడిని సైతం తట్టుకుని భారత్.. స్వతంత్ర వైఖరిని ప్రదర్శించింది. ఇందుకు గాను.. రష్యా వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితిలో జరిగిన ఓటింగ్‌కు పలుమార్లు భారత్ దూరంగా ఉంది. దీంతో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ యుద్దాన్ని ఆపే శక్తి భారత్ కు ఉంది అని.. పలు మార్లు అంతర్జాతీయ మీడియా ముఖంగా చెప్పుకోచ్చారు. యుద్ధం ఆపేందుకు భారత్ సాయం కావాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు భారత ప్రధాని నరేంద్ర మోదీతో సమయం కల్పించుకోని మరి వరుస సమావేశాలు అవుతున్నారు.
కాగా ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ రష్యా పర్యటన నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వేయ్యి కల్లతో వేచి చూస్తున్నారు. ఉక్రెయిన్ – రష్యా యుద్ధం ఆపేందుకు భారత్ శాంతి సందేశం ఇస్తుందని ఉక్రెయిన్ ఎదురు చూస్తుంది.