Modi Telangana Tour : తెలంగాణలో మరోసారి ప్రధాని మోదీ పర్యటన..

తెలంగాణలో బీజేపీ అధికార లక్ష్యంగా ఇతర రాష్ట్రాల సీఎంలను తీసుకోచ్చి మరి ప్రచారం చేయిస్తుంది. ఒవైపు ప్రధాని మోదీ, జేపీ నడ్డా , అమిత్ షాలు, అయితే మరోవైపు సీఎంలు, కేంద్రమంత్రులు వచ్చి తెలంగాణలో గడప గడప కు తమ ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే మూడు సార్లు ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. తాజాగా మరోసారి ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు ప్రధాని.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 27, 2023 | 09:40 AMLast Updated on: Nov 27, 2023 | 9:40 AM

Prime Minister Modis Visit To Telangana

దేశం మొత్తం మీద ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. కానీ యావత్ భారత్ చూపు తెలంగాణపైనే ఉంది. మరీ అంతలా తెలంగాణలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు జాతీయ పార్టీల అదినాయకులు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు అంతిమ ఘటానికి చేరుకున్నారు. ఎన్నికల ప్రచారానికి ఒక రోజు మాత్రమే ఉంది. ప్రధాన పార్టీలు, బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు ఎన్నికల ప్రచారం మరింత ముమ్మరం చేస్తున్నారు.

తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న ప్రధాని మోదీ..

తెలంగాణలో బీజేపీ అధికార లక్ష్యంగా ఇతర రాష్ట్రాల సీఎంలను తీసుకోచ్చి మరి ప్రచారం చేయిస్తుంది. ఒవైపు ప్రధాని మోదీ, జేపీ నడ్డా , అమిత్ షాలు, అయితే మరోవైపు సీఎంలు, కేంద్రమంత్రులు వచ్చి తెలంగాణలో గడప గడప కు తమ ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే మూడు సార్లు ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. తాజాగా మరోసారి ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు ప్రధాని.

గత రెండు రోజులుగా తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో నిమగ్నం బిజీబిజీగా ఉన్న ప్రధాని.. నిన్న రాత్రి తిరుమల చేరుకోని.. ఇవాళ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మరి కొద్ది సేపటిలో తిరుపతి విమానాశ్రయం నుంచి తెలంగాణకు బయలుదేరనున్నారు ప్రధాని. మోదీ షెడ్యూల్ ప్రకారం.. తెలంగాణలో ప్రధాని మూడు రోజులు పర్యటన చేయనున్నారు. మోదీ మూడో రోజు పర్యటనగా ఇవాళ ప్రధాని బహిరంగ సభల్లో పాల్లొని.. హైదరాబాద్ లో రోడ్ షో నిర్వహించనున్నారు. ప్రధాని షెడ్యూల్ ప్రకారం.. తిరుమల నుంచి మోదీ.. ప్రత్యేక హెలికాప్టర్ లో మహబూబాబాద్ వెళ్లి.. అక్కడి నుంచి బీజేపీ బహిరంగ సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం ఒంటిగంటకు కరీంనగర్ ప్రచార సభలో ప్రసంగిస్తారు. తర్వాత.. తిరిగి హైదరాబాద్ చేరుకోనున్న ప్రధాని మోదీ.. సాయంత్రం 5 నుంచి 6 గంటల.. 2 కిలోమీటర్ల పొడవునా.. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుంచి కాచిగూడ లోని వీర సావర్కర్ విగ్రహం వరకు రోడ్ షో చేయనున్నారు. అనంతరం రాత్రికి తిరిగి ఢిల్లీ వెళ్లనున్నారు ప్రధాని నరేంద్ర మోదీ.