Ayodhya : అయోధ్యలో మోడీ పర్యటన..
ఉత్తర ప్రదేశ్ లోని ఆధ్యాత్మిక నగరి అయిన అయోధ్యం చేరుకున్నారు ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ. ఈ ఉదయం అయోధ్య ప్రధానికి రాష్ట్ర గవర్నర్ ఆనందిబెన్ పటేల, సీఎం యోగి ఆదిత్యనాథ్, స్వాగతం పలికారు.
ఉత్తర ప్రదేశ్ లోని ఆధ్యాత్మిక నగరి అయిన అయోధ్యం చేరుకున్నారు ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ. ఈ ఉదయం అయోధ్య ప్రధానికి రాష్ట్ర గవర్నర్ ఆనందిబెన్ పటేల, సీఎం యోగి ఆదిత్యనాథ్, స్వాగతం పలికారు. అనంతరం ఎయిర్ పోర్టు నుంచి 15 కిలో మీటర్ల దూరం వరకు ఆయర ర్యాలీలో పాల్గోన్నారు. ధరమ్ పథ్ నుంచి అయోధ్య రైల్వే స్టేషన్ వరకు ఆయన ర్యాలీలో దారి పొడవునా ప్రధానికి ప్రజలు సాదర స్వాగతం పలికారు. మధ్య మధ్యలో దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 1,400 మంది కళాకారులు ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు.
నేటి మోదీ పర్యటనలో భాగంగా ఆధునిక హంగులు, రామమందిర చిత్రాలతో పునరుద్దరించారు అయోధ్య రైల్వే స్టేషన్. అనంతరం మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభిస్తారు ప్రధాని మోదీ. అనంతరం రెండు అమృత్ భారత్ రైళ్లు, ఆరు వందేభారత్ రైళ్లకు పచ్చజెండా ఊపనున్నారు. ఇక విమానాశ్రయం పక్కనున్న మైదానంలో ఏర్పాటుచేసే ‘జన్ సభ’లో అయోధ్య ఆలయం గురించి మాట్లాడతారు.