Ram Mandir – Modi : మోడీ ఆ తీర్థం ఎందుకు తీసుకున్నారు ?
అయోధ్య శ్రీరామ మందిరంలో (Ayodhya Ram Mandir) బాలరాముడి ప్రాణప్రతిష్ట పూర్తయిన తర్వాత ప్రధాని నరేంద్రమోడీ... తీర్థం తీసుకోవడం సంచలనంగా మారింది. ఎందుకు తీసుకున్నారని ప్రతిఒక్కరూ అడుగుతున్నారు. అయితే మోడీ ఇవాళ దీక్ష విరమించడమే ఇందుక్కారణం.
అయోధ్య శ్రీరామ మందిరంలో (Ayodhya Ram Mandir) బాలరాముడి ప్రాణప్రతిష్ట పూర్తయిన తర్వాత ప్రధాని నరేంద్రమోడీ… తీర్థం తీసుకోవడం సంచలనంగా మారింది. ఎందుకు తీసుకున్నారని ప్రతిఒక్కరూ అడుగుతున్నారు. అయితే మోడీ ఇవాళ దీక్ష విరమించడమే ఇందుక్కారణం.
అయోధ్య శ్రీరామ మందిరంలో రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట తర్వాత ప్రధాని నరేంద్రమోడీ తన 11 రోజుల అనుష్ఠాన దీక్షని విరమించారు. అయోధ్య రాముడు గర్భగుడిలో కొలువుదీరే వరకూ అత్యంత నిష్ఠగా ఉంటానని జనవరి 12 నాడు మోడీ తెలిపారు. అప్పటి నుంచి ఆయన అదే నిష్ఠను కొనసాగిస్తున్నారు. ప్రాణ ప్రతిష్ఠ ముగియడంతో దీక్ష విరమించారు. ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన వేదికపై కూర్చున్నప్పుడే తీర్థం తీసుకుని తన కఠిన దీక్షని విరమించారు మోడీ. గోవింద్ దేవ్ గిరి మహరాజ్ ఆయనకు తీర్థం అందించారు. దీన్నే చరణామృత్ అని అంటారు. పాలతో తయారు చేసిన ఈ తీర్థాన్ని పూజలో వాడతారు. ఈ తీర్థాన్ని ఇచ్చి ప్రధాని మోడీ దీక్షను విరమింపజేశారు దేవ్ గిరి మహరాజ్. ఈ సందర్భంగా 11 రోజుల పాటు కఠిన దీక్షని చేపట్టడం గురించి మోడీ దీక్షను మెచ్చుకున్నారు.
ప్రధాని నరేంద్రమోడీ 11 రోజుల పాటు కేవలం కొబ్బరి నీళ్లు మాత్రమే తీసుకున్నారు. ప్రతి రోజూ కూడా గంట 11 నిముషాల పాటు ఓ ప్రత్యేక మంత్రాన్ని పఠించారు. కొందరు ఆధ్యాత్మిక గురువులు ఈ ప్రత్యేక మంత్రాన్ని మోడీకి ఉపదేశించారు. అందుకే ఆయన ప్రతి రోజే జపించారు. ఇలాంటి దీక్ష చేసేటప్పుడు మంత్రం జపం చాలా ముఖ్యం… శక్తిమంతమైనదని పండితులు చెబుతున్నారు. అలాగే రాముల వారి చరిత్రకు సంబంధించిన కొన్ని గ్రంథాలను కూడా చదివారు. ఈ 11 రోజుల పాటు ఎన్ని ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటున్నప్పటికీ… చాలా నిష్ఠగా ఉన్నారు ప్రధాని మోడీ. నేలపై నిద్రించడం… రోజూ గోపూజ చేశారు. అన్నదానం, వస్త్రదానం కూడా చేశారు.
దీక్షలో భాగంగానే వివిధ రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాలను సందర్శించారు. ఏపీలోని లేపాక్షిలో వీరభద్ర స్వామి ఆలయం, కేరళ గురవయార్ లోని శ్రీరామస్వామి ఆలయం సందర్శించారు.