Prithvi Shaw: లగ్జరీ ఫ్లాట్ కొన్న క్రికెటర్.. ధర ఎంతో తెలుసా..?
దేశ వాణిజ్య రాజధాని ముంబై నగరంలోని బాంద్రాలో సముద్రానికి దగ్గర్లో ఈ ఫ్లాట్ కొనుగోలు చేశాడని తెలుస్తోంది. దీనిపై సోషల్ మీడియాలో ఫోటోలు కూడా పోస్ట్ చేసాడు. ఈ ప్లేస్ గురించి ఎన్నో కలలుగన్నానని.. ఇప్పుడు వాటిని నిజం చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నాడు.

Prithvi Shaw: మన దేశంలో క్రికెటర్ల లైఫ్ స్టైల్ గురించి అందరికీ ఎంతో ఆసక్తి ఉంటుంది. వాళ్ళు ఏం కొన్నా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తాజాగా టీమిండియా క్రికెటర్ పృథ్వీ షా ఖరీదైన ఫ్లాట్ కొనడం చర్చనీయాంశంగా మారింది. అతడు కొన్న ఫ్లాట్ ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. దాదాపు 20 కోట్లు ఖర్చు చేసే లగ్జరీ ఫ్లాట్‌ను షా సొంతం చేసుకున్నాడని క్రికెట్ వర్గాల సమాచారం.
Traffic Diversions: రంజాన్ పండుగ.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు
దేశ వాణిజ్య రాజధాని ముంబై నగరంలోని బాంద్రాలో సముద్రానికి దగ్గర్లో ఈ ఫ్లాట్ కొనుగోలు చేశాడని తెలుస్తోంది. దీనిపై సోషల్ మీడియాలో ఫోటోలు కూడా పోస్ట్ చేసాడు. ఈ ప్లేస్ గురించి ఎన్నో కలలుగన్నానని.. ఇప్పుడు వాటిని నిజం చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నాడు. తనకంటూ సొంత ఇల్లు ఉండాలనేది డ్రీమ్ అని.. అదిప్పుడు నిజమైందనిన్నాడు. సొంత ఇల్లు అనేది స్వర్గం లాంటిదని.. ఇక మీదట అంతా మంచే జరగాలంటూ ఎమోషనల్ నోట్ రాసుకొచ్చాడు. పృథ్వీ షా ఫ్లాట్‌కు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. పృథ్వీ షా ఫ్లాట్ పిక్స్ చూసిన నెటిజన్స్.. ఇల్లు సూపర్‌గా ఉందని అంటున్నారు. పృథ్వి షా 2018లో టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చాడు.
ఓపెనర్‌గా ఆడుతూ మంచి పేరు సంపాదించాడు. అయితే ఆ తర్వాత టీమ్‌లో తన ప్లేస్ నిలబెట్టుకోవడంలో ఫెయిలయ్యాడు. ఫామ్ కోల్పోవడం, బరువు పెరగడంతో జట్టులో చోటు కోల్పోయాడు. డొమెస్టిక్ క్రికెట్లో రాణించినా సెలక్టర్లు అతడ్ని పరిగణనలోకి తీసుకోలేదు. ఇటీవల గాయం నుంచి కోలుకున్న షా.. రంజీ ట్రోఫీలో బరిలోకి దిగి అదరగొట్టాడు. ముంబై కప్పు కొట్టడంలో కీలకపాత్ర పోషించాడు. ఈసారి ఐపీఎల్‌లో తన మార్క్ చూపిస్తున్నాడు.
View this post on Instagram