Wife With Boy Friend: భర్త డబ్బుతో చదువుకుని ప్రియుడితో జంప్
టింకూ అనే అబ్బాయికి ప్రియ అనే అమ్మాయితో 2020లో పెళ్లి జరిగింది. ప్రియకు నర్సింగ్ చేయాలని ఆశ. భార్య కోరిక నెరవేర్చేందుకు టింకూ ప్రియను నర్సింగ్‌లో జాయిన్ చేశాడు. ఆతరువాత ఏమైందో ఇప్పుడు చూసేయండి.

Priya, the wife of Tinku, a pizza delivery boy in Jharkhand, was nursing and left with someone else
అర్థం చేసుకునే భర్త దొరకడం అదృష్టంగా భావిస్తుంటారు అమ్మాయిలు. అలాంటి భర్త రావాలని పూజలు, వ్రతాలు కూడా చేస్తుంటారు. మంచి భర్త దొరికితే ఇక జీవితానికి ఇది చాలు అన్నట్టు ఎంతో అదృష్టంగా ఫీలవుతుంటారు. కానీ కొందరు ఆ అదృష్టానికి షాపంగా మారుతున్నారు. పెళ్లి అంటేనే అబ్బాయిలు భయపడేలా చేస్తున్నారు. భర్త ఉండగానే మరొకరి మోజులో పడి జీవితాలను నాశనం చేస్తున్నారు. కొంత కాలం క్రితం ఓ వ్యక్తి తన భార్యను కష్టపడి చదివించి సబ్ డివిజినల్ మేజిస్ట్రేట్‌ని చేశాడు. కానీ ఆ భార్య మాత్రం ఉద్యోగం వచ్చిన తరువాత తన కొలీగ్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుని భర్తను వదిలేసింది. అక్కడితో చాలదన్నట్టు కట్నం కోసం వేధిస్తున్నాడంటూ జైల్‌కు కూడా పంపింది. అచ్చూ అలాంటి ఘటనే ఇప్పుడు ఝార్ఖండ్‌లో కూడా జరిగింది.
టింకూ అనే అబ్బాయికి ప్రియ అనే అమ్మాయితో 2020లో పెళ్లి జరిగింది. ప్రియకు నర్సింగ్ చేయాలని ఆశ. భార్య కోరిక నెరవేర్చేందుకు టింకూ ప్రియను నర్సింగ్‌లో జాయిన్ చేశాడు. రాత్రింబవళ్లు పిజ్జా డెలివెరీ చేస్తూ ప్రైవేట్ హాస్టల్‌లో భార్యను ఉంచి చదివించాడు. కాని ప్రియ మాత్రం టింకూను మోసం చేసింది. కాలేజీలో వేరే అబ్బాయిని ప్రేమించింది. భర్తను వదిలేసి ఆ అబ్బాయితో పారిపోయింది. ప్రియుడిని పెళ్లి చేసుకుని ఆ ఫొటోలు టింకూకు పంపింది. ప్రాణంగా చూసుకున్న భార్య ఇంత మోసం చేయడంతో తల్లడిల్లిపోయాడు టింకూ. ఈ న్యూస్ ఇప్పుడు ఇంటర్నెట్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఇలాంటివి విన్నప్పుడే పెళ్లి పెటాకులు మానేసి సన్యాసం తీసుకోవడం బెటర్ అనిపింస్తోదంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.