Priyanka Gandhi: కేసీఆర్ మళ్లీ గెలిస్తే మీ భూములు మాయం.. ఉద్యోగాలు నిల్: ప్రియాంకా గాంధీ

రాష్ట్రంలో అత్యాచారాలు, రైతుల ఆత్మహత్యలు పెరిగాయి. రుణాలు మాఫీ కాకపోవంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. చిన్న చిన్న వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తొమ్మిదేళ్లలో తెలంగాణ ప్రజలకు ఏం చేసిందనే విషయాన్ని పదిసార్లు ఆలోచించుకుని నిర్ణయం తీసుకోవాలి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 27, 2023 | 05:54 PMLast Updated on: Nov 27, 2023 | 5:54 PM

Priyanka Gandhi Fires On Cm Kcr Govt And Modi Govt

Priyanka Gandhi: తెలంగాణలో కేసీఆర్ మళ్లీ గెలిస్తే భూములు మాయమవుతాయని, నిరుద్యోగుల బతుకులు ఆగమవుతాయని విమర్శించారు కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకా గాంధీ. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం భువనగిరితోపాటు, గద్వాలలో జరిగిన రోడ్ షోలలో ప్రియాంకా గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. “తెలంగాణ ప్రజలు రెండుసార్లు అధికారం ఇస్తే బీఆర్ఎస్ ఏం చేసింది. పేదలకు ఎలాంటి ప్రయోజనాలు అందడం లేదు. రాష్ట్రంలో అత్యాచారాలు, రైతుల ఆత్మహత్యలు పెరిగాయి.

TELANGANA CONGRESS: హరీష్ రావు మైండ్ బ్లాక్ అయింది.. బీఆర్ఎస్‌ది తప్పుడు ప్రచారం: కాంగ్రెస్ నేతలు

రుణాలు మాఫీ కాకపోవంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. చిన్న చిన్న వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తొమ్మిదేళ్లలో తెలంగాణ ప్రజలకు ఏం చేసిందనే విషయాన్ని పదిసార్లు ఆలోచించుకుని నిర్ణయం తీసుకోవాలి. తెలంగాణలో యువతకు ఉద్యోగాలు కావాలనే ఆశ ఉందా? మీ కల నెరవేరాలంటే కాంగ్రెస్‌కు ఓట్లు వేసి గెలిపించాలి. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు అధికారం కోసం చూస్తాయ. ప్రజల కష్టాలను పట్టించుకోవు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడం కోసం మీ హక్కును అమ్ముకోరనే విషయాన్ని ఈ ఎన్నికల ద్వారా తెలియజేయాలి. నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగాయి. కేసీఆర్ ప్రభుత్వం కళ్లు మూసుకుని నిద్రపోతోంది. ప్రజల సమస్యలు పట్టించుకునే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ది చెప్పాల్సిన సమయం వచ్చింది. నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎంతో కష్టపడి చదివి, పరీక్షలు రాస్తే.. ఆ ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయి. పై నుంచి కింద వరకు ఈ ప్రభుత్వంలో ఎక్కడ చూసినా అవినీతే కనిపిస్తోంది.

కాళేశ్వరం ప్రాజెక్టులో ఎంత అవినీతి జరిగిందో అందరికీ తెలిసిన విషయమే. ఈ ప్రభుత్వం ప్రజల కష్టాల్లో అండగా నిలబడలేదు. అమరుల బలిదానాలతో తెలంగాణ ఏర్పడింది. ప్రత్యేక రాష్ట్రం వస్తే ఉద్యోగాలు వస్తాయని కలలుకన్న నిరుద్యోగుల ఆశల్ని బీఆర్ఎస్ ప్రభుత్వం నీరుగార్చింది. కేసీఆర్ అన్ని వర్గాలను మోసం చేశారు. బీఆర్ఎస్ నేతలు చేసినన్ని కబ్జాలు దేశంలో మరెక్కడా లేవు” అని ప్రియాంకా గాంధీ అన్నారు.