Priyanka Gandhi Vadra: కేసీఆర్ కుటుంబ సభ్యులకే పదవులు.. తెలంగాణ కోసం కొట్లాడిన మీకు ఉద్యోగాలేవి..?: ప్రియాంకా గాంధీ

సీఎం కేసీఆర్.. ఆయన కుటుంబ సభ్యులకు మంత్రి పదువులు ఇచ్చాడు కానీ.. ఒక్కరికి కూడా ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వలేదు. రాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్మాణంలో చాలా అవినీతి జరిగింది. రైతుల రుణమాఫీ చెయ్యలేదు. రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్, కర్ణాటకలో కాంగ్రెస్ రైతులకు రుణమాఫీ చేసింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 24, 2023 | 07:15 PMLast Updated on: Nov 24, 2023 | 7:15 PM

Priyanka Gandhi Vadra Criticised Cm Kcr In Husnabad Public Meeting

Priyanka Gandhi Vadra: తెలంగాణ కోసం కొట్లాడినం అని చెప్పుకొనే కేసీఆర్‌ కుటుంబ సభ్యులకు మంత్రి పదవులు వచ్చాయి. కానీ, అదే తెలంగాణ కోసం పోరాడిన మీకు ఉద్యోగాలు వచ్చాయా.. అని ప్రశ్నించారు కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకా గాంధీ. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో శుక్రవారం జరిగిన కాంగ్రెస్ ప్రచార సభలో ప్రియాంకా గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్‌పై విమర్శలు చేశారు. “ఎన్నికల సమయంలో ఏం మాట్లాడాలో, ఎవరి గురించి చెప్పాలో అది చెప్పాలని వచ్చాను. బిఆర్ఎస్ పాలనలో ప్రజలు ఎవరు సంతోషంగా లేరు. గౌరవెల్లి, గండిపల్లి, తోటపల్లి ప్రాజెక్టులు పూర్తయ్యాయా..? ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత తీసుకున్న ముల్కనూర్ గ్రామంలో ఏమయినా అభివృద్ధి జరిగిందా..? స్థానిక ఎమ్మెల్యే భూ నిర్వాసితుల పక్షాన మాట్లాడారా..?

BARRELAKKA: బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించబోతున్న బర్రెలక్క.. అసలు విషయం ఇదీ..!

10 సంవత్సరాలు గడుస్తున్నా నియోజకవర్గ సమస్యలను పరిష్కరించాడా..? వడ్ల తూకంలో ఎక్కువ తరుగు తీస్తున్నా స్థానిక ఎమ్మెల్యే ఏం చేశాడు. సీఎం కేసీఆర్.. ఆయన కుటుంబ సభ్యులకు మంత్రి పదువులు ఇచ్చాడు కానీ.. ఒక్కరికి కూడా ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వలేదు. రాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్మాణంలో చాలా అవినీతి జరిగింది. రైతుల రుణమాఫీ చెయ్యలేదు. రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్, కర్ణాటకలో కాంగ్రెస్ రైతులకు రుణమాఫీ చేసింది. అదానీకి దేశంలో అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను మోడీ అప్పగిస్తున్నాడు. రైతు ఒక్కరోజులో 70 రూపాయలు సంపాదిస్తుంటే, అదాని మాత్రం 16 వందల కోట్లు సంపాదిస్తున్నారు. 10 సంవత్సరాలు బిఆర్ఎస్ పాలన చూశారు. ఇప్పుడు కాంగ్రెస్ రాష్ట్ర అభివృద్ధికి ఒక ప్రణాళికతో మీ ముందుకు వచ్చింది. ఎంఐఎం తెలంగాణలో పుట్టిన పార్టీ. దేశంలో వివిధ రాష్ట్రాల్లో 50, 60 సీట్లలో పోటీ చేస్తుంటే రాష్ట్రంలో 8,9 సీట్లకు ఎందుకు పోటీ చేస్తుంది..? ఓవైసీ ఎప్పుడూ రాహుల్ గాంధీని నిందిస్తారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రజలను రాహుల్ గాంధీ కలిశారు.

బిఆర్ఎస్, బిజెపి, ఎంఐఎం.. కాంగ్రెస్‌ను అధికారంలోకి రాకుండా అడ్డుకుంటున్నాయి. ఎందుకంటే వాళ్ల అవినీతి సొమ్మును బయటికి తీసి, ప్రజలకు పంచుతామని. సోనియమ్మ తెలంగాణ ఇచ్చింది కాబట్టి ఆమెను మీరు గౌరవిస్తారు. మహాత్మా గాంధీ నుంచి ఇప్పటి వరకు మేం ప్రజల కోసం కొట్లాడతున్నాం. ప్రజల సంపద ప్రజలకే చెందాలని కాంగ్రెస్ చూస్తుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 6 గ్యారంటీలు అమలు చేస్తాం. ఛత్తీస్‌ఘడ్, కర్ణాటక రాష్ట్రాల్లో చేసి చూపించాం. హుస్నాబాద్‌లో మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయడానికి కృషి చేస్తాం. మీరు ఈ సారి కాంగ్రెస్ పార్టీని గెలిపించండి. కాంగ్రెస్ మీ అభివృద్ధి కోసం పాటుపడుతుంది. ఐదేళ్ల తరవాత వచ్చి నేను ఇదే వేదికపైన ఏం చేశామో గర్వంగా మాట్లాడుతాను. తెలంగాణ కోసం కొట్లాడింది మీరు. రాష్ట్రం మీది. మీకోసం కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది అని ప్రియాంక” వ్యాఖ్యానించారు.