Priyanka Gandhi Vadra: తెలంగాణకు ప్రియాంకా గాంధీ.. శుక్ర, శని వారాల్లో పర్యటన
కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం.. 24న మధ్యాహ్నం 12:00 గంటలకు పాలకుర్తి చేరుకుంటారు. అక్కడి ప్రచారంలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 1:30 గంటలకు హుస్నాబాద్‌లో జరిగే సభలో పాల్గొంటారు.
Priyanka Gandhi Vadra: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత్రి ప్రియాంకా గాంధీ రాష్ట్రంలో రెండు రోజులపాటు పర్యటించనున్నారు. ఈ ఎన్నికల్ని తెలంగాణ అధిష్టానం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, కర్ణాటక సీఎం సిద్ధ రామయ్య వంటి నేతలు వరుసగా తెలంగాణలో పర్యటిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేస్తున్నారు. దీనిలో భాగంగా శుక్ర, శని (నవంబర్ 24, 25) వారాల్లో ప్రియాంకా గాంధీ తెలంగాణలో పర్యటించబోతున్నారు.
Barrelakka: చెల్లీ భయపడకు.. నేనొస్తున్నా.. బర్రెలక్కకు మద్దతుగా సర్పంచ్ నవ్య..
ఆమె పర్యటన షెడ్యూల్ ఖరారైంది. కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం.. 24న మధ్యాహ్నం 12:00 గంటలకు పాలకుర్తి చేరుకుంటారు. అక్కడి ప్రచారంలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 1:30 గంటలకు హుస్నాబాద్‌లో జరిగే సభలో పాల్గొంటారు. సాయంత్రం 3:00 గంటలకు కొత్తగూడెంలో జరిగే ప్రచార సభకు హాజరవుతారు. ప్రచారం ముగిసిన అనంతరం రాత్రి ఖమ్మంలో బస చేస్తారు. అనంతరం 25న ఉదయం 11:00 గంటలకు ఖమ్మం, పాలేరుల్లో జరిగే సభల్లో పాల్గొంటారు. తర్వాత మధ్యాహ్నం 1:30 గంటలకు సత్తుపల్లి చేరుకుని ప్రచారం నిర్వహిస్తారు.
అనంతరం మధ్యాహ్నం 02:40 గంటల నుంచి 03:30 వరకు మధిర ప్రచార సభలో పాల్గొంటారు. ప్రియాంకా గాంధీ పర్యటన కోసం హెలికాప్టర్ సిద్ధం చేస్తుంది కాంగ్రెస్. పర్యటన ముగిసిన అనంతరం అక్కడి నుండి విజయవాడకు చేరుకొని, గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి ఢిల్లీకి బయల్దేరి వెళ్తారు. ప్రియాంకా గాంధీ పర్యటనలో రాష్ట్ర కాంగ్రెస్‌కు చెందిన ముఖ్య నేతలు హాజరవుతారని పార్టీ వెల్లడించింది.