పవన్ తో ఛాన్స్, గాల్లో తేలిపోతున్న నానీ హీరోయిన్

స్టార్ హీరోలతో సినిమా ఛాన్స్ అంటే హీరోయిన్లకు పండగ, మంచి అవకాశాల కోసం ఎదురు చూసే హీరోయిన్లు స్టార్ హీరోలతో ఒక్క బొమ్మ పడి అది హిట్ అయితే చాలు అనుకుంటారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 20, 2024 | 01:44 PMLast Updated on: Aug 20, 2024 | 1:45 PM

Priyanka Happy With Get A Chance With Pawan

స్టార్ హీరోలతో సినిమా ఛాన్స్ అంటే హీరోయిన్లకు పండగ, మంచి అవకాశాల కోసం ఎదురు చూసే హీరోయిన్లు స్టార్ హీరోలతో ఒక్క బొమ్మ పడి అది హిట్ అయితే చాలు అనుకుంటారు. అలాంటిది పవన్ కళ్యాణ్ లాంటి హీరో పక్కన సినిమా అంటే…? ఇక ఆ హీరోయిన్ సంతోషానికి హద్దులు ఏముంటాయి చెప్పండి. సినిమా హిట్ అయిందంటే చాలు ఆమె వెనక్కు తిరిగి చూసుకునే అవసరం ఉండదు. ఇప్పుడు ప్రియాంకా ఆరుళ్ మోహన్ కూడా అదే కోరుకుంటుంది. పవన్ కళ్యాణ్ తో సినిమా ఛాన్స్ కొట్టేసింది ఈ అమ్మడు.

యువ దర్శకుడు సుజిత్ దర్శకత్వంలో వస్తున్న సినిమాలో ఈమె హీరోయిన్. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా కొంత జరిగింది. ఇక పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత మిగిలిన షూట్ ప్లాన్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఈ తరుణంలో ఈ అమ్మడు చేసిన కామెంట్స్ బాగా వైరల్ అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న ఓజీ సినిమాలో నటించడం తన అద్రుష్టం అంటుంది ప్రియాంకా. ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు తాను రుణపడి ఉంటాను అంటూ చెప్పుకొచ్చింది. నానీ హీరోగా వచ్చిన సరిపోదా శనివారం సినిమా ప్రమోషన్ లో ఆమె పాల్గొంది.

ఈ సందర్భంగా ఆమెతో పాటు నానీ, దర్శకుడు హరీష్ శంకర్ కూడా పాల్గొన్నారు. పవన్ నానీ ఎప్పుడూ క్రియేటివ్ గా ఆలోచిస్తారని ప్రియాంకా చెప్పుకొచ్చింది. పవన్ ప్రజల గురించి ఎక్కువగా ఆలోచన చేస్తారని నానీ తన సినిమాల గురించి ఎక్కువగా కలలు కంటారు అంటూ చెప్పుకొచ్చింది ఈ అమ్మడు. హరీష్ శంకర్ కూడా పవన్ కళ్యాణ్ పై ప్రసంశల వర్షం కురిపించారు. కాగా ఈ సినిమాకు సంబంధించి ఒక టీజర్ కూడా విడుదల చేయగా మంచి స్పందన వచ్చింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ప్రభుత్వంలో మంత్రిగా బిజీగా ఉండటంతో సినిమా షూటింగ్ ఆలస్యం అవుతోంది.